No.1 Short News

Umar Fharooq
పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రమాద ఘంటికలు
పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. రాష్ట్రంలో 10 కోట్లకు పైగా కోళ్లు ఉంటే... 5.42 లక్షల కోళ్లు చనిపోయాయని అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
13 Feb 2025 08:14 AM
0
18