No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన వెలువడింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు హాల్‌టికెట్‌లు గురువారం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐ. నరసింహమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు గురువారం నుండి హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది.
Latest News
13 Feb 2025 09:35 AM
0
29