

No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంభారత నౌకాదళంలో 270 పోస్టులు.. ఎస్ఎస్ సీ నోటిఫికేషన్
భారత నౌకాదళంలో వివిధ పోస్టుల భర్తీకి షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్ సీ) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాలలో మొత్తం 270 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆయా పోస్టులను బట్టి పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన అవివాహిత స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదని, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొంది. పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీలలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్య్యూకు పిలవనున్నట్లు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులను సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటామని, వీరికి మొదటి నెల నుంచే రూ.లక్ష వేతనంగా చెల్లించనున్నట్లు తెలిపింది.
Latest News
13 Feb 2025 11:55 AM