

No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంనా భర్తకు ప్రాణహాని ఉంది.. పోలీసులు దురుసుగా ప్రవర్తించారు: వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
కిడ్నాప్, దాడి, బెదిరింపు కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా మీడియాతో వంశీ భార్య పంకజశ్రీ మాట్లాడుతూ తన భర్తకు ప్రాణహాని ఉందని చెప్పారు. పోలీస్ స్టేషన్ లో విచారణ సమయంలో తన భర్త పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. తన భర్త అరెస్ట్ పై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. వంశీ అరెస్ట్ అక్రమమని... అరెస్ట్ వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని మేజిస్ట్రేట్ కు తన భర్త తెలిపారని చెప్పారు.
తాజా వార్తలు
14 Feb 2025 10:40 AM