No.1 Short News

మహతి న్యూస్
దర్శి ఎస్సై మురళిని సన్మానించిన శివరాజ్ నగర్ యువత
చీమకుర్తి ఫైరింగ్ రేంజ్ లో జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆధ్వర్యంలో గురువారం వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్ లో దర్శి ఎస్సై మురళి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్ నగర్ యువత తరపున శాలువాతో సన్మానం నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల శ్రీనాథ్, పుప్పాల సురేష్, ఇర్ల బాలకాశి, ఇట్ల ఆనంద్, కోల రమేష్, రామకృష్ణ, గంగాధర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
స్థానిక నవీకరణలు
14 Feb 2025 15:19 PM
1
39