

No.1 Short News
Newsreadతెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో 60 మందికి పైగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో 60 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా ఇంటర్ మార్క్స్ మెమోలలో ఫొటోలు తప్పుగా వచ్చాయి. దీంతో కాలేజీల్లో చేరిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధిత విద్యార్థులంతా నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడ బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు పూలే కాలేజీ, కోడేరు బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు పూలే కాలేజీకి చెందినవారు. వీరు 2024లో ఇంటర్ పాస్ అయ్యారు.
Latest News
15 Feb 2025 12:01 PM