

No.1 Short News
Newsreadవక్ఫ్ ఆస్తుల రక్షణకై ముస్లింల ర్యాలీ
రాష్ట్ర సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గొప్ప నిరసన ర్యాలీ జరిగింది. రాష్ట్ర మైనారిటీ నాయకుడు సయ్యద్ సమి హుస్సేని, ముస్లిం ఐక్యవేదిక నాయకులు కలెక్టర్కు, మంత్రి నారాయణను వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ వక్స్ ఆస్తులను దోచుకోవాలని కుట్ర చేస్తోందని, ముస్లింలను ఆర్థికంగా దెబ్బతీయడానికే బిల్లు తెచ్చిందని ఆరోపించారు. వక్స్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, కేంద్రం తన నిరంకుశ వైఖరి మార్చుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ వక్స్ ఆస్తుల రక్షణకై ముస్లిం మైనారిటీలు, ప్రజాస్వామ్య ప్రియులు రోడ్డుపై వస్తారని హెచ్చరించారు.
Breaking News
17 Feb 2025 17:20 PM