

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ కంట్రోల్ తప్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్
కంట్రోల్ తప్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్
తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భద్రతా వైఫల్యం
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ పోలీసునంటూ 3 సార్లు వచ్చి వెళ్ళి, రూ.2.82 లక్షలు కాజేసిన గుర్తు తెలియని వ్యక్తి
ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్ లోకి 4 సార్లు నకిలీ ఉద్యోగుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రావడం ఘటనలు మరువక ముందే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ 3 సార్లు వచ్చి వెళ్ళిన దుండగుడు
నిందితుడు ఐసీసీసీకి ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్ లో కూకట్ పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జ్ఞానసాయి ప్రసాద్ అనే వ్యక్తిని కలిసి, తాను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ హరిజన గోవర్ధన్ అని నమ్మించాడు
హోటల్ వ్యాపారంలో లాభాలు ఉంటాయని చెప్పి జ్ఞానసాయి ప్రసాద్ దగ్గర రూ.2.82 లక్షలు వసూలు చేశాడు.
దుంగడుగు తన ముందు పలుమార్లు ఐసీసీసీ నుండి బయటకు రావడంతో, అతను నిజంగానే టాస్క్ ఫోర్స్ అధికారి అని జ్ఞానసాయి ప్రసాద్ నమ్మి మోసపోయాడు.
అసలు నిజం తెలిసాక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు
రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది మంత్రులు కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకునే ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం, భద్రతా వలయం నడుమ ఉండే ఐసీసీసీలోకి దుండగుడు వెళ్లడంపై భద్రతా వ్యవస్థకు అవమానం అని విమర్శలు వస్తున్నాయి.
Local Updates
19 Feb 2025 10:28 AM