నవోదయ 2.0 నాటు సారా నిర్మూలన అవగాహన సదస్సులో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి
ఈ కార్య్రమంలో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ
నాటు సారా తయారీకి స్వస్తి పలికి మంచి మార్గాన్ని ఎన్నుకోవాలన్నారు నాటు సారా తయారీదారుల్లో పరివర్తన వస్తే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని గౌరవంగా బతకాలని సూచించారు. నాటు సారా తయారీ మానుకొని జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. కల్తీ నాటు సారా తయారు చేయడం వల్ల పేద ప్రజలు ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.