

No.1 Short News
NewsreadAnger | విపరీతమైన కోపం వస్తుందా..? ఈ చిట్కాలను పాటిస్తే శాంతమూర్తులు అవుతారు..!
కోపం అనేది మనకు కలిగే భావోద్వేగాల్లో ఒకటి. కోపం వస్తే ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. కొందరికి క్షణంలోనే పట్టరానంత కోపం వస్తుంది. దీంతో తమ ఎదురుగా ఏ వస్తువు ఉంటే దాన్ని విసిరేస్తారు. ఇంకొందరు కోపం వస్తే తలను దేనికైనా బాదుకుంటారు. కొందరు పెద్ద పెద్దగా అరుస్తారు. ఇంకా కొందరు పచ్చి బూతులు మాట్లాడుతారు. ఇవన్నీ చాలా మంది కోపాన్ని వ్యక్త పరిచేందుకు చేసే పనులు. అయితే ఇలా చేయడం వల్ల కోపం మరింత పెరుగుతుందే కానీ తగ్గదు. పట్టరానంత కోపం వచ్చినప్పుడు వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టండి. గాఢంగా శ్వాస తీసుకోండి. గాలిని బాగా లోపలికి పీల్చి బయటకు వదలండి. నెమ్మదిగా ఇలా చేయండి. దీంతో నాడీ మండల వ్యవస్థ ప్రభావం చూపిస్తుంది. కోపాన్ని తగ్గిస్తుంది.
Latest News
19 Feb 2025 18:59 PM