

No.1 Short News
Shaida Reporter నేడు శ్రీకాకుళం జిల్లాకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు వెళుతున్నారు. జిల్లాలోని పాలకొండలో ఇటీవల వైసీపీ నేత పాలవలస రాజశేఖరం మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ పాలకొండ వెళ్లనున్నారు.
ఈ రోజు (గురువారం) ఉదయం 11 గంటలకు జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండ చేరుకుంటారు. వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. అనంతరం పాలకొండ నుంచి నేరుగా బెంగళూరుకు జగన్ వెళ్లనున్నారు.
Latest News
20 Feb 2025 10:53 AM