No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
యాదగిరిగుట్ట ఉత్సవాలకు కేసియర్ కి ఆహ్వానం
యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం కార్యక్రమానికి కేసీఆర్‌కు ఆహ్వానం అనంతరం జరిగే యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా.. పూజారుల ఆహ్వానం నాటి కేసీఆర్ ప్రభుత్వం పునర్నిర్మాణం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి.. ఈనెల 23న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, యాదగిరిగుట్ట పునర్నిర్మాణ కర్త, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. అనంతరం.. మార్చి నెల 1 నుంచి 11వ తారీఖు వరకు జరిగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు.
Latest News
22 Feb 2025 07:56 AM
0
6