

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ 3 నెలలు గడిచినా రైతులకు అందని బోనస్ డబ్బులు
3 నెలలు గడిచినా రైతులకు అందని బోనస్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సన్నవడ్లకు రూ.500 బోనస్ పథకం చాలా మంది రైతులకు ఇంకా అమలు కాలేదు ఓట్ల కోసం బోనస్ అని నమ్మించి ఇప్పుడు ఎగ్గొడుతున్నాడని రేవంత్ రెడ్డి పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఇంకా 23 వేల మంది రైతులకు బోనస్ డబ్బులు రావల్సి ఉంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.25 కోట్లు, నల్గొండ జిల్లాలో రూ.18.59 కోట్లు, నిర్మల్ జిల్లాలో రూ.4.50 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ చాలా మంది రైతులకు ఇంకా బోనస్ డబ్బులు జమ అవ్వలేదు బోనస్ డబ్బుల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతుంటే విడతల వారీగా జమ అవుతాయని చెప్తున్నారు దీంతో బోనస్ బోగస్ అయినట్టే అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Latest News
22 Feb 2025 11:46 AM