

No.1 Short News
T Maheshగోరంట్ల గుంతల మయంగా వానవోలు రహదారి
శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానవోలు పంచాయతీలో గుంతలమయంగా వానవోలు రహదారి
గోరంట్ల మండలంలోని గోరంట్ల నుంచి ఉగ్గురాంపల్లి వానవోలు రోడ్డు గుంతలు ఏర్పడి చాలా అధ్వానంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. ఈ రోడ్డుపై ఆటోలు రాక తాటిమాకులపల్లె, బాచన్నపల్లి ఉగ్గురాంపల్లి, పెట్లకుంటపల్లి, ఎముకల గుట్లపల్లి ప్రజలు గోరంట్ల వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Local Updates
04 Mar 2025 08:23 AM