

No.1 Short News
Newsreadస్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా ట్రాక్టర్లను పంపిణీ చేసిన గొట్టిపాటి లక్ష్మి
తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయం నందు స్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా మంజూరైన శివరాంపురం నాగం బొట్లపాలెం బొద్దికూరపాడు లక్కవరం గ్రామపంచాయతీలకు మంజూరైన చెత్త తరలింపు ట్రాక్టర్లను గొట్టిపాటి లక్ష్మీ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెత్త పేరుకు పోనివ్వకుండా చెత్త తరలింపు ట్రాక్టర్లను ఉచితంగా అందజేస్తున్నామని, ఈ ట్రాక్టర్లను ఉపయోగించి ప్రతి గ్రామం క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చుకోవాలని తద్వారా పరిసరాలు పరిశుభ్రమై ప్రజా ఆరోగ్యానికి దోహదపడుతుందని ఆమె కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాలను దృష్టిలో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ స్వచ్ఛత కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామం అన్నారు
Latest News
04 Mar 2025 14:20 PM