

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ బీర్కూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకుల సంబరాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా బలపరిచిన అభ్యర్థి మాల్కా కొమురయ్య విజయం సాధించడంతో బీర్కూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మిఠాయిలు పంచుతూ బాణసంచా కాల్చుతు సంబరాలు చేసుకున్నారు .ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతు , తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలం లో భారతీయ జనతా పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతున్నారని రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారం చేపడతామని వారు తెలిపారు . ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు నాగళ్ళ సాయి కిరణ్ , మండల నాయకుడు బస్వరాజ్ ,బీరుకొండ, యోగేష్ , సాయి బాబా , శంకర్ , తదితరులు పాల్గొన్నారు
Latest News
05 Mar 2025 07:47 AM