No.1 Short News

Newsread
చిన్న పొరపాటుతో వినియోగదారుడు అకౌంట్లో కోట్లు
కస్టమర్ ఖాతాలో నగదు జమ చేయాల్సిన ఉద్యోగి.. పొరపాటున నగదు మొత్తం వేయాల్సిన చోట అకౌంట్ నంబర్ రాశాడు. అంతే.. ఏకంగా 52,314 కోట్ల రూపాయలు ఖాతాదారుడి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అంతేకాదు, దానిని పర్యవేక్షించాల్సిన మరో అధికారి కూడా గుర్తించకుండా ఓకే చెప్పడంతో వేల కోట్ల రూపాయలు వినియోగదారుడి ఖాతాలో జమయ్యాయి. అయితే, ఆ తర్వాత పొరపాటును గుర్తించి పంపిన మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.ఇదెవరో కస్టమర్ చేసిన పనికాదు.. స్వయంగా బ్యాంకు ఉద్యోగి తప్పదంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు అయిన సిటీ గ్రూప్‌లో 2023 ఏప్రిల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Latest News
05 Mar 2025 10:12 AM
0
29