

No.1 Short News
Newsreadపాఠశాలల వేధింపులకు చెక్.. వాట్సాప్ ద్వారా టెన్త్ హాల్ టికెట్లు అందుకున్న ఏపీ విద్యార్థులు
ఏపీలోని టెన్త్ విద్యార్థులు తొలిసారి వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు అందుకున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల వేధింపులకు అడ్డుకట్ట పడింది. పూర్తి ఫీజు చెల్లించలేదంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను తమ వద్దే పెట్టుకుని వేధింపులకు దిగుతున్నట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు నేరుగా విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నంబర్లకే హాల్ టికెట్లను పంపింది. దీంతో వారు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఇలాంటి విధానం అమల్లోకి రావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఇటీవల ఇంటర్ విద్యార్థులు కూడా ఇలాగే వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు అందుకున్నారు. ఈ విధానంపై తల్లిదండ్రులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ సాయంతో ఎవరికి వారు నేరుగా తమ హాల్ టికెట్లను తీసుకుంటున్నారు.
Education
05 Mar 2025 10:23 AM