No.1 Short News

Umar Fharooq
నాగబాబు నామినేషన్ ను బలపరిచిన నారా లోకేశ్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన నేత కొణిదెల నాగబాబు నామినేషన్ వేయగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్ బలపరిచారు. ఈ సందర్భంగా కొణిదెల నాగబాబు ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో లోకేశ్, నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్,పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తన నామినేషన్ ను బలపరిచిన నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ కు,కృతజ్ఞతలు తెలిపారు.
Latest News
07 Mar 2025 17:22 PM
1
19