

No.1 Short News
Umar Fharooqతాళ్లూరు మండలంలోని రామభద్రపురంలో రీ సర్వేపై రైతులకు అవగాహన
తాళ్లూరు మండలంలో రామభద్రాపురంగ్రామాన్ని మోడల్పైలట్ రీసర్వే గ్రామంగా ఎంపికచేసిఇటీవల జరిగిన రీసర్వేపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ సంజీవరావు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న రైతులందరికీ సర్వే జరిగే ముందు నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది రైతుల సమక్షంలోనే భూములకొలతలను తీయటం జగిందన్నారు. రికార్డుల ఆధారంగా భూమిలో ఉన్న హక్కుదారుని వివరాలు పూర్తిగా నమోదు చేయటం జరిగిందన్నారు.రీసర్వే జరిగినందున ఏవైనా అభ్యంతరాలు,స మస్యలు వుంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొని వస్తే పరిశీలించి సమస్య పరిష్కరించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో డీటీప్రశాంత్,మండల సర్వేయర్ వై.శ్రీనివాసరావు,విఆర్వోలు చంద్రశేఖర్ రావు,కాశీంబీ,రమణారెడ్డి,వి లేజ్ సర్వేయర్ లు భవానీ,మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.
Latest News
08 Mar 2025 09:42 AM