No.1 Short News

Umar Fharooq
10 వ తరగతి విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 6.49 లక్షలమంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాబట్టి విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి,అక్కడి నుంచి తిరిగి ఇంటికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చంటూ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.
Latest News
08 Mar 2025 09:43 AM
0
23