

No.1 Short News
Umar Fharooqపశువుల భీమా పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలి
ఒంగోలు జిల్లాలోని తమ పశువులకు పోషకులు బీమా చేయించుకోవాలని పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి (డీఏహెచ్వో) డాక్టర్ బేబీరాణి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.ఒకసారి బీమా ప్రీమియం చెల్లిస్తే మూడేళ్ల వరకు వర్తించేలా చర్యలు తీసుకున్నారని ఆమె అన్నారు.పశువులు మృత్యువాత పడిన సమయంలో పరిహారం అందుతుందని తెలిపారు.ఒక్క పశువుకు రూ.15వేలకు రూ.960 ప్రీమియం ఉందని ప్రభుత్వ వాటా రూ.768, రైతు వాటా రూ.192 చెల్లించాలన్నారు.రూ.30వేల బీమాకు ప్రీమియం రూ.1,920 ఉండగా ప్రభుత్వవాటా రూ.1,536, రైతు వాటా రూ.384, గేదెలు, మేకలు ప్రీమియం రూ.375 ఉండగా ప్రభుత్వ వాటా రూ.300, రైతు వాటా రూ.75 చె ల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులందరూ ఈ బీమా పథకాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆమె చెప్పడం జరిగింది.అయితే జిల్లాకు మొదటి విడతలో రూ.18లక్షల రాయితీని గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం విడుదల చేయగా ప్రస్తుతం రూ.16 లక్షలు విడుదల చేసిందనీ ఆమె అన్నారు.
Latest News
08 Mar 2025 11:44 AM