

No.1 Short News
Umar Fharooqఎ బి సి స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం
తాళ్లూరు మండలం లో ఎబీసీ హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం కరస్పాండెంట్ టి.శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన సభను నిర్వహించారు. కరస్పాండెంట్ మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులకు తీర్చిదిట్టటంతో తల్లుల పాత్ర కీలకమని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నత స్థితికి తీసుకురావాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడు కె వెంకటేశ్వర రావు మాట్లాడుతూ సమాజం అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పటంలో ఎంతో ఓర్పు, నేర్పు, ఔదార్యం ప్రదర్శిస్తారని అన్నారు. డైరెక్టర్ కాలేషా బాబు మాట్లాడుతూ ప్రకృతిలో పురుషులకు ముందు ఆమె ఉందని ప్రతి ఇంగ్లీషు పదంలో ఉన్న అక్షరాలతో ఉదాహరణలో వివరించారు. విజేతలైన ఉపాధ్యాయులు సుజాత లకు, ఉదయలక్ష్మిలకు బహుమతులు అందించారు.
Latest News
09 Mar 2025 16:40 PM