No.1 Short News

Umar Fharooq
తాళ్లూరు మండలంలోని వెలుగు కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమం
తాళ్లూరులోని వెలుగు కార్యాలయంలో ఏపిఎం దేవరాజు అధ్యక్షత వహిస్తూ మహిళా దినోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపిపి,శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మహిళలు మానసికంగా ఎంతో దృఢమైన వారని ఆయన అన్నారు. ఏపిఎం దేవరాజు మాట్లాడుతూ గృహంలోనే కాకుండా ఉద్యోగ,వ్యాపార రంగాలలో ముందంజ వేస్తున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ టిడిపి మండల అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లాలు ఇంటికి వెలుగు అయితే మహిళలు దేశానికే వెలుగునిస్తున్నారని వివిధ రంగాలలో విశేష సేవలు అందిస్తున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి,కొండారెడ్డి, జడ్పిటిసి మారం వెంకారెడ్డి, ఎంఈఓ సుబ్బయ్య, ఎడమ కంటి శ్రీనివాస్ రెడ్డి, గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ యాతం శ్రీనివాసరెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు శివనాగిరెడ్డి, ప్రకృతి వ్యవసాయ కోఆర్డినేటర్ నరసింహులు, మండల సమైక్య అధ్యక్షురాలు ఎం సుజాత, ఏపిఎం దేవరాజు, ఈసీలు మోహన్ రావు, సుచేంద్ర,అకౌంటెంట్ కుమారి,వివో ఏలు గ్రామ సంఘ అధ్యక్షురాలు పాల్గొనడం జరిగింది.
Latest News
09 Mar 2025 17:25 PM
1
46