

No.1 Short News
కపురం శ్రీనివాసరెడ్డిదరిశి గురుకుల పాఠశాల పై శ్రధ్ధచూపండి.
ఈ రోజు దరిశి నగర పంచాయతీ పరిధిలోని ఎన్నెస్పీ కాలనీలోని డాక్టర్ అంబేద్కర్ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల ప్రాంగణంలో 50 శెంట్ల (అర ఎకరా)స్థలాన్ని ఇంకా ఇప్పటివరకూ ఎవరి ఆధీనంలో లేకుండా గురుకుల పాఠశాలకు అప్పచెప్పకుండా ఎందుకు పాఠశాల మద్య ఉంటారని విషయాన్ని, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్ మరియు మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఒంగోలు ప్రకాశం భవనంలో కలిసి, గురుకుల పాఠశాల బాగోగుల గురించి
చర్చించే దానిలో భాగంగా, పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు అనుభవిస్తున్న తీరు,తలిదండ్రుల పర్యవేక్షణకు దూరంగావుండి గురుకులంలో విద్యనభ్యసించడానికి వచ్చిన చిన్నారులను అన్నీ తామేనని విద్యార్థుల గురుతరమైన పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న గురువులందరూ అనుభవిస్తున్న వ్యధను కలెక్టర్ తమీమ్ అన్సారియా కు పూసగుచ్చినట్లు వివరించానని కపురం శ్రీనివాస రెడ్డి అన్నారు.ఎన్నెస్పీ కాలనీలో ఈ గురుకుల పాఠశాలే గాకుండా,దూరదర్శన్ కేంద్రం,ఎంపీపి స్కూల్,ఫైర్ స్టేషన్లలో,ఇండోర్ స్టేడియం,డీఎస్పీ ఆఫీసు మరియు వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయాలు ఉన్నాయి.అన్నీ కార్యాలయాలు బాగున్నప్పటికీ, ఏ క్లారిటీ లేక విద్యార్థుల పరీక్షల సమయంలో విష సర్పాలతో భయాందోళనకు గురవుతున్నారని కలెక్టర్ కు తెలిపానని తెలియజేశారు.
Latest News
11 Mar 2025 22:20 PM