

No.1 Short News
Umar Fharooqబొద్దికూరపాడు లో క్లస్టర్ కాంప్లెక్స్
తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు బుధవారం జరిగాయి.ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్,సబ్జెక్టు ఉపాధ్యాయులకు సమావేశాలు జరిగాయి. సమావేశాలలో బోధనా పాఠ్యాంశాల గురించి, విద్యార్థుల ప్రగతి గురించి, పరీక్షల గురించి చర్చించడం జరిగింది. సమావేశాలలో స్థాన విలువల గురించి గండూరి నాగరాజు ఉపాధ్యాయుడు తయారుచేసిన టిఎల్ఎం గురించి వివరణ ఉపాధ్యాయులను ఆకట్టుకుంది.కార్యక్రమంలో క్లస్టర్ కాంప్లెక్స్ చైర్మన్ P సుబ్బారావు,కన్వీనర్ K శేషు, సి ఆర్ పి ,పులి మారుతి, మండల ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ వెంకాయమ్మ ,శేషు, కరీం,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Latest News
13 Mar 2025 19:21 PM