No.1 Short News

Newsread
మంత్రి గొట్టిపాటి తో దొనకొండ అభివృద్ది గురించి చర్చించిన కపురం
2004 నుండి 2024 వరకూ 5 దఫాలుగాఎమ్మెల్యే గా విజయం సాధించి,హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా వుండి,2024 జూన్ 12 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులుగా ప్రమాణస్వీకారం చేసి, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాలో ప్రప్రధమంగా, పవిత్రమైన శింగరకొండలోని పుణ్య క్షేత్రమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉత్సవాలను ప్రారంభించుటకు రాష్ట్ర మంత్రి హోదాలో మొదటిసారిగా వచ్చిన తరుణంలో, తన ఆప్త మిత్రులైన రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్ గారిని, ప్రకాశం జిల్లా (IRCS) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్ మరియు మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆలయ ఉత్సవాలలో భాగంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కపురం శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి, చిరకాల మిత్రుడైన గొట్టిపాటి తో మట్లాడుతూ...., ఆంధ్రరాష్ట్రం లోనే ప్రకాశం జిల్లా దొనకొండ పరిసర ప్రాంతంలో కొన్నివేల ఎకరాలు ప్రభుత్వ భూములు వున్నాయని, ఈ ప్రాంతాన్ని సోలార్ హబ్బు గా ఏర్పాటుచేయబోతున్నట్లు రాష్ట్ర శాసనసభలో మీ ద్వారా ప్రకటించడం చలా మేము చాలా గర్వించదగిన సందర్భమనీ, గతంలో ఈ ప్రాంతంలో ఆసియా ఖంఢంలోనే అతిపెద్ద ఎరోనాటికల్ ప్రాజెక్టు ను ఏర్పాటుచేయాలని చాలా సువిశాలమైన భూముల కేటాయింపుకై చాలా సార్లు సర్వేలు నిర్వహించారని, ఇవన్నీ తుదిరూపంలోకి వచ్చేదశలో, అంతర్జాతీయ పారిశ్రామికధిగ్గజాలకు మౌళిక వసతులలో భాగంగా, 1932 ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 137 ఎకరాల విస్తీర్ణమైన దొనకొండ విమానాశ్రయాన్ని పలుమార్లు(AAI) ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు పలుమార్లు సర్వే చేసి, ఎలాంటి పురోగతికి నోచుకోలేదని, ఈసారీ ఏవిధంగా మీరు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న సోలార్ హబ్ తోపాటుగా,అంతర్జాతీయ ఏరోనాటికల్ ప్రాజెక్టుకు నిర్మాణానికి ముఖ్యమంత్రి ని ఒప్పించి,బ్రిటీష్ గవర్నమెంటులో ఒక వెలుగు వెలిగిన దొనకొండకు మీ చొరవతో పూర్వ వైభవాన్ని తీసుకురావాలని,పేరుప్రఖ్యాతులున్న చందవరం భౌధ్ధస్తూపాలను అభివృధ్ధి చేసి,దొనకొండను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా చేసే విధంగా, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో కొత్తపట్నం సముద్ర తీరం నుండి ఒంగోలు,చీమకుర్తి,తూర్పుగంగవరం,దరిశి వయా దొనకొండ మీదుగా తోకపల్లి,కుంట జంక్షన్,దోర్నాల మీదుగా సుప్రసిధ్ధ శైవక్షేత్రమైన శ్రీశైలం వరకు అధిక వ్యయంతో, కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా వున్న ఈ శుభతరుణంలో కొత్తపట్నం సాగర తీరంనుండి శ్రీశైలపుణ్య క్షేత్రం వరకు పర్యాటక రహదారి ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చొరవ తీసుకునేవిధంగా చేసి దొనకొండకు, దరిశి ప్రాంతానికీ పుర్వవైభవాన్ని తీసుకురావడానికి ప్రధాన దోహదకారిగా వుంటారని మా ప్రాంత ప్రజానీకం వెయ్యికళ్ళతో మీ సేవకోసం ఎదురుచూస్తున్నారని ఆప్త మిత్రులైన రాష్ట్ర మంత్రి గొట్టిపాటికి ఆలయంలోని ఉత్సవాల విరామ సమయంలో అన్నీ విషయాలను సవివరంగా వివరించానని, దానకి నావైపునుండి సంపూర్ణంగా మద్దత్తునిచ్చి, వీటిని నెరవేర్చేందుకు నావంతు శక్తివంచన లేకుండా వీటి అమలుకు గట్టిగా కృషిచేస్తానని మంత్రి గొట్టిపాటి మాటిచ్చారని కపురం శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.
Latest News
13 Mar 2025 19:27 PM
3
87