దర్శి: ఆపద సమయంలో మహిళల రక్షణకు శక్తి టీమ్ ఏర్పాటు
ప్రతి మహిళ, చిన్నారుల రక్షణ,భద్రత మొదట ప్రాధాన్యత అని, ఆపదలో ఉన్న వారిని రక్షించడమే లక్ష్యంగా శక్తి టీమ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మహిళలు భద్రత,రక్షణకు ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ద్వారా ఆపద సమయంలో మహిళలు,బాలికలు రక్షించేందుకు తక్షణమే స్పందించి చేరుకునేందుకు వీలుగా దర్శి సబ్ డివిజన్ పరిధిలో శక్తి బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం లో ఒక ఎస్సై, ముగ్గురు మేల్ కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఇంకా మద్దతు గా సబ్ డివిజన్ లో వున్న ఉమెన్ పీసీ లందరూ సపోర్ట్ గా వుంటారని తెలిపారు.ఎవరికైనా, ఎప్పుడైనా ఏదైనా ఆపద ఎదురైతే శక్తి యాప్ లో ఆప్షన్స్ ను ఉపయోగించి రక్షణ పొందవచ్చునని దర్శి డీఎస్పీ తెలిపారు.