

No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుకనికట్టు చేయడంలో చంద్రబాబు దిట్ట: బొత్స
AP: ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనికట్టు చేయడంలో CM చంద్రబాబు దిట్ట అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్కాముల పేరుతో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండలిలో ఆయన మండిపడ్డారు. '2019-24 మధ్య జరిగిన స్కాముల మీద చర్చ పెట్టారు. కానీ 2014 నుంచి 2024 వరకు జరిగిన స్కాములపై మేం చర్చకు సిద్ధం. మా హయాంలో ఎలాంటి స్కాములు జరగకుండానే జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారు' అని ఆయన ఫైర్ అయ్యారు.
Politics
17 Mar 2025 16:09 PM