No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరులో పేకాట శిబిరంపై దాడులు
ముండ్లమూరు మండలంలోని పులిపాడు గ్రామంలో పేకాట ఆడుతున్నరని సమాచారం రావడంతో, ముండ్లమూరు ఎస్సై నాగరాజు తన సిబ్బందితో సోమవారం పేకాట శిబిరంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద రూ.31,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
Local Updates
25 Mar 2025 04:01 AM
3
20