No.1 Short News

Newsread
విశాఖ లో రాష్ట్ర వ్యాప్త యూట్యూబ్ జర్నలిస్టుల సంఘం జై వార్షికోత్సవ వేడుకలు
రాష్ట్రవ్యాప్త యూట్యూబ్ జర్నలిస్టులతో వేడుక .. జై యూనియన్ కు వెన్ను దన్నుగా నిలుస్తా : దాడి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ ... దాడి సత్యనారాయణ వైభవంగా విశాఖలో జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. విశాఖ పబ్లిక్ లైబ్రరీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్, నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాడి సత్యనారాయణ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూట్యూబ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జై యూనియన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి వివరించిరు. జర్నలిస్టులు తెలిపిన పలు విషయాలు సావధానంగా ఆయన విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించిన జైయూనియన్ కు తొలుత హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ.... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సుపరిపాలనలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇలాంటి సమర్థవంతమైన నాయకుల దృష్టికి జై యూనియన్ విలేకరుల సాధక బాధలు, కష్టనష్టాలు ప్రభుత్వానికి చేరవేయడంలో వారధిగా నిలవాలనే ఉద్దేశంతో నేడు ఈ సభకు విచ్చేశానన్నారు. ఎంతటి మహావృక్షమైన ఒక విత్తనంతోనే ప్రారంభమవుతుందని, అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ పత్రికలు, చానలల్లో పనిచేసి, సమాజ సేవలో తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో జర్నలిజంపై పూర్తి అవగాహనతో ఏర్పడిన జై యూనియన్ కూడా ఒక విత్తనముగా నాటబడిందన్నారు. రాబోయే రోజుల్లో ఈ యూనియన్ మహావృక్షంగా ఎదగాలంటే పరిపాలకుల అండదండలు ఎంతైనా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజుల్లో వార్తాపత్రికలు , టీవీ చానల్స్ కంటే మొబైల్ ద్వారా వార్తలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారనని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలు దేనిని ఆదరిస్తున్నారో దానిని ప్రభుత్వము ఎంతైనా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కావున జై యూనియన్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో తాను వెన్నుదన్నుగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా యూట్యూబ్ జర్నలిస్టుల పక్షాన తాను ఎట్టి పోరాటానికైనా ముందుంటానని హామీ ఇచ్చారు. వ్యయ, ప్రయాసలకు ఓర్చి వార్తలు చేరవేయడంలో ఎంతో శ్రమిస్తున్నారని కావున వీరి శ్రమను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రాబోవు ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ కు కూడా యూట్యూబ్ జర్నలిస్టులు వచ్చే ఎన్నికలలో మరింత ఘనవిజయం సాధించేందుకు ఉపయోగపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సభకు అధ్యక్షత వహించిన యువి రావ్ జై సంస్థ వ్యవస్థాపన, ఒక్క ఏడాదిలో జై యూనియన్ చేపట్టిన కార్యక్రమాలు వేదికపై వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాలకు విస్తరించటంతో వేడుకకు తరలివచ్చిన జిల్లా జై యూనియన్ అధ్యక్షులను జై రాష్ట్ర కార్యవర్గం జై యూనియన్ జ్ఞాపక, సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, జై యున్న రాష్ట్ర కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.
Latest News
11 Apr 2025 05:16 AM
0
16