దర్శి సీఐ ఎస్సై ఆధ్వర్యం లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై బాలికలకు అవగాహన
కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో దర్శి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ Y. రామారావు , ఎస్సై M. మురళి, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన విద్యార్థులతో చర్చిస్తూ, బాగా చదువుకోవాలని, సమాజంలో క్రమశిక్షణతో ప్రవర్తించాలని, తల్లిదండ్రులకు, గురువులకు గౌరవం ఇవ్వాలని సూచించారు. మీరు చదువులో మెరుగ్గా ప్రవర్తించి, మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలి అని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. అలాగే, పిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ ల మధ్య తేడా ఏమిటి? ఎలాంటి పరిస్థితుల్లో పెద్దల సహాయం తీసుకోవాలి? అనే విషయాల్లో స్పష్టమైన అవగాహన కల్పించారు. పిల్లలు ఎటువంటి అనుమానాస్పద పరిస్థితిని ఎదుర్కొన్నా భయపడకుండా గురువులకు లేదా పోలీసులకు చెప్పాలని సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడి, పిల్లల పట్ల ప్రేమతో, శాంతంగా ప్రవర్తిస్తూ వారి భవిష్యత్తు కోసం ఎలా మార్గనిర్దేశనం చేయాలో కొన్ని విలువైన సూచనలు చేశారు. చివరిగా, విద్యార్థులలో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు పోలీస్ శాఖ తరఫున పెన్నులు అందజేశారు. పిల్లలు ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించారు.
గుంటూరు లో విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై k. తరంగిణి
గుంటూరు, జూలై 2: నగరంలోని ఏటి అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై కె.తరంగిణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ తేడాలు, టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఎలా వాడాలో, అలాగే సైబర్ క్రైమ్‌కు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. వ్యక్తిగత భద్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంచే విధంగా ఆమె ప్రసంగించారు.
ఇలాంటి అంశాలపై మరింతగా తెలుసుకోవాలని, ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని ఆమె కోరారు. అత్యవసర సమయంలో 112 నంబరుకు డయల్ చేయాలన్న విషయాన్ని ఆమె ప్రత్యేకంగా వివరించారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, భద్రతా పరంగా జాగ్రత్తలు పాటించేందుకు ఉపయోగపడిందని స్కూల్ సిబ్బంది పేర్కొన్నారు.
పోగొట్టుకున్న బంగారాన్ని బాదితులకు తిరిగి అందచేసిన ప్రకాశం పోలీసులు
యర్రగొండపాలెం మండలం, అయ్యంబోట్లపల్లి గ్రామానికి చెందిన పెదపోగు కోటయ్య అనే వ్యక్తి 31/05/2025 తేదీన
యర్రగొండపాలెంలోని ఓ బ్యాంకులో గోల్డ్ పెట్టి తన కుటుంబ అవసరార్థం డబ్బులు తీసుకుందామనే క్రమంలో యర్రగొండపాలెం వచ్చాడు. పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా వద్ద సోడా తాగుతూ గోల్డ్ జారవిడుచుకొని వెళ్ళి పోయినాడు. బ్యాంకు కి వెళ్లి చూస్తే గోల్డ్ ఉండదు తిరిగి వెళ్లి ఆ సోడా బండి దగ్గర వెతుకుతూ ఉండగా సోడా బండి యజమాని ఏమైందని అడుగుగా, ఇక్కడ సోడా తాగుదామని వచ్చి గోల్డ్ పోగొట్టుకున్నాను బ్యాంకు కి వెళ్లి ఎంత చూసినా కనిపించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే సోడా బండి యజమాని అతను వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి సోడా తాగిన విషయాన్ని గమనించి సోడా బండి అతనికి ఫోన్ పే చేసిన విషయాన్ని అతనికి చెప్పాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా పట్టణ ఎస్సై పి చౌడయ్య వెంటనే స్పందించి ఫోన్ పే నెంబర్ ను ట్రేస్ అవుట్ చేసి ఆ వ్యక్తిని గుర్తించి పట్టుకున్నారు. బాధిత వ్యక్తికి గోల్డ్ అందజేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ పోయిన తన బంగారంను వెతికి తనకు అప్పగించేందుకు కృషి చేసిన ఎస్సై పి చౌడయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దర్శి: కపురం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే కార్యక్రమాలు
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా.., ప్రకాశం జిల్లా (ఐఆర్సీయస్)ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, దరిశి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్)లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి అర్బన్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చేతన్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధులుగా డిప్యూటీ డీయం&హెచ్ఓ డాక్టర్ సుజన,ప్రకాశం జిల్లా మలేరియా అధికారి ఎన్.మధుసూధనరావు,ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా డిప్యూటీ డీయం&హెచ్ఓ సుజన మాట్లాడుతూ.., సీజనల్ వ్యాదులపట్ల అప్రమత్తంగా వుండాలని సిబ్బందికి సూచించారు.మలేరియా, డెంగ్యూ లాంటి ప్రాణాంతక విషజ్వరాలు రాకుండా ప్రతి శుక్రవారం దోమల నియంత్రణకు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా అధికారి మధుసూదన్ రావు తెలిపారు.జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఉద్దేశించి కపురం శ్రీనివాసరెడ్ఢి మాట్లడుతూ...., వైద్యులు కనిపించే దేవుళ్ళని,ప్రజలకోసం అహర్నిశలూ శ్రమిస్తుంటారని, ప్రపంచంలో వైద్యుల సేవలు వెలకట్టలేమని కపురం కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ డే సందర్భంగా డిప్యూటీ డీయం&హెచ్ఓ డాక్టర్ సుజనను,జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మధుసూధన్ రావును కపురం శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎన్నెమ్ లు,ఆశావర్కర్లు,వైద్యశాల సిబ్బంది కలిసి డాక్టర్ చేతన్ ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ పారామెడికల్ అధికారి సుబ్బారెడ్డి,దరిశి మలేరియా ఇంచార్జి బసవారెడ్డి,హెచ్.వీ సుహాషిణి,జె.సుశీలమ్మ యావన్మంది వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఏలూరు RTC బస్టాండ్‌లో కనీస సదుపాయాల లేమి – ప్రయాణికుల ఆగ్రహం
ఏలూరు: నగరంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌లో టాయిలెట్ సదుపాయాల వద్ద కనీస సదుపాయాల లేమి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. శుభ్రత సరిగా లేకపోవడంతో పాటు, రాత్రివేళల్లో విద్యుత్ లేకపోవడం ప్రయాణికుల అసౌకర్యానికి కారణమవుతోంది.
ప్రయాణికులు వాడే టాయిలెట్లలో కనీసంగా కరెంట్ లైట్లు కూడా లేకపోవడం గమనార్హం. దీనిపై పలువురు ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ సదుపాయాలతో ఉన్నా, టాయిలెట్ వాడకానికి డబ్బులు వసూలు చేయడం అసంబద్ధమని విమర్శిస్తున్నారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, వృద్ధులు రాత్రివేళ టాయిలెట్ల వద్ద కరెంట్ లేకపోవడంతో భయంతో వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.
ప్రయాణికులు కోరుతున్నారంటే కనీసం శుభ్రత, కరెంట్ లైట్లు, మరియు బేసిక్ సదుపాయాలను బస్టాండ్ యాజమాన్యం కల్పించాలనీ, లేకపోతే అధికారులతో ఫిర్యాదు చేస్తామంటున్నారు.
TG: పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్ పేలుడుకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు దర్శనమిచ్చాయి. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలు పరిసర ప్రాంతాల్లో గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. ఇప్పటికే 40 మందికి పైగా మరణించారని అధికారులు చెబుతున్నా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. అటు పటాన్చెరు ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాల వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.
పార్టీలో లీడర్లుగా ఎదిగేందుకు యువతకు ఇప్పుడే సరైన అవకాశం: జగన్
వైయస్‌ఆర్‌సీపీలో యూత్ వింగ్ అనేది చాలా క్రియాశీలకమైంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర , పార్టీలో లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు యువతకి గొప్ప అవకాశం ఉంది అని ఈరోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం సమావేశంలో వైయస్ జగన్ మాట్లాడారు.
AP Government: మందు బాబులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మద్యం ప్రియులకు మరో శుభవార్తను అందించనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత మద్యం విధానాన్ని పునఃప్రవేశపెట్టింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అందుబాటులో లేని ప్రముఖ బ్రాండ్ల మద్యంను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రూ.99లకే క్వార్టర్ మద్యం బాటిళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనితో పేద వర్గాల మద్యం ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మద్యం ప్రియులకు మరో శుభవార్తను అందించడానికి సిద్ధమవుతోంది. ఇకపై మద్యం దుకాణాల వద్దే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో భాగంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న పర్మిట్ రూమ్‌ల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టేందుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
సెప్టెంబర్ నుంచి మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు. గతంలో అన్ని దుకాణాలకు ఏడాదికి రూ.5 లక్షలు పర్మిట్ రూమ్ ఫీజుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండు కేటగిరీలుగా మార్పు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలోని దుకాణాలకు రూ.7.50 లక్షలు, మిగిలిన దుకాణాలకు రూ.5 లక్షల చొప్పున ఫీజులుగా ప్రతిపాదించారు.
రాష్ట్రంలో 3,736 మద్యం దుకాణాలు ఉండగా, వీటికి రూ.5 లక్షల చొప్పున పర్మిట్ రూమ్‌ల ఫీజుల రూపంలో వసూలు చేస్తే రూ.186 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కార్పొరేషన్ల పరిధిలోని దుకాణాలకు అదనంగా రూ.2.5 లక్షలు వసూలు చేయడం ద్వారా పర్మిట్ రూమ్‌ల ద్వారా వచ్చే ఆదాయం రూ.200 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు.
జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన డా||గొట్టిపాటి లక్ష్మి
వైద్యో నారాయణో హరి అంటారు. దేవుడు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మ ఇస్తారు. అందుకే డాక్టర్లను దేవునితో సమానంగా ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కుతారు. వైద్యులు నిస్వార్థ సేవకు, అంకితభావానికి ప్రతీకలు. జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని వైద్యులకు నా శుభాకాంక్షలు. జూలై 1 ప్రఖ్యాత వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డా.బిడన్ చంద్ర రాయ్ గారి పుట్టిన మరియు మరణించిన రోజు. వైద్యులు నిస్వార్థ సేవకు, అంకితభావానికి ప్రతీకలు. ప్రతి ప్రాణం కోసం పోరాడే యోధులు వారు. వైద్యుడు తన చేతిలో కత్తిని పట్టుకొని ఉన్నప్పుడు, అది కేవలం ఒక ఆపరేషన్ మాత్రమే కాదు, ఒక జీవితాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు ఇచ్చిన అవకాశం. డాక్టర్ల కృషి, త్యాగం సమాజానికి వెలకట్టలేనిది. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించటంలో వైద్యులు చేస్తున్న కృషి మరువలేనిది. కరోనా విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యులు చేసిన సేవలు వెలకట్టలేనివి. అనారోగ్య సమస్యలతో, వైద్యం అందక ఏ ఒక్కరూ చనిపోకూడదు. మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం పూర్తిస్థాయి వైద్య సేవలు అందాలన్నదే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్ర రాష్ట్రం సంపూర్ణ ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు.
కరెంట్ షాక్ తో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన బూచేపల్లి
ముండ్లమూరు మండలం వేములబండ గ్రామములో కరెంట్ షాక్ తో మృతి చెందిన ఆవుల గౌతం పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మనోధర్యం కల్పించారు.
వాంతులు,విరేచనాలతో చిన్నారి ఆయేషా(5)ని RMP వద్దకి తెచ్చిన తల్లితండ్రులు...
చిన్నారి ఆయేషాకి ఇంజక్షన్ ఇచ్చిన ఆర్.ఎంపీ వైద్యుడు..
ఇంజెక్షన్ చేసిన కొద్ది సేపటికే స్పృహ తప్పి కింద పడిపోయిన ఆయేషా...
నరసరావుపేట లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి...RMP వైద్యుడు నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తల్లిదండ్రుల ఆరోపణ...నరసరావుపేట పెద్ద చెరువులో ఉన్న RMP క్లినిక్ వద్ద తల్లిదండ్రులు,బంధువులు ఆందోళన...
అజాన్ కోసం యాప్.. లౌడ్ స్పీకర్లపై ఆంక్షలు నేపథ్యంలో..
లౌడ్ స్పీకర్ల సౌండ్ పై మహారాష్ట్రలో ఆంక్షలున్న నేపథ్యంలో మసీదులు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యాయి. అజాన్ (ప్రార్థన కోసం పిలుపు) ను నేరుగా సంబంధికులకు చేరేలా ప్రత్యేకంగా ఆన్ లైన్ అజాన్ అనే మొబైల్ యాప్ తో రిజిస్టరైనట్లు వార్తలొస్తున్నాయి. దీనిని తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన సంస్థ అభివృద్ధి చేసింది.
ప్రార్థనల పిలుపు కోసం వాడే లౌడ్ స్పీకర్ల వాడకంపై ఆంక్షలున్నాయి. ప్రార్థన పిలుపును నేరుగా సంబంధిత వ్యక్తులకే చేరడానికి ఉపయోగపుతుంది. లౌడ్ స్పీకర్లకు ఇది ప్రత్యామ్నాయం. ప్రార్థనలు చేసేవారు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా తమకు దగ్గర్లో వున్న మసీదు నుంచి అజాన్ పిలుపు వినడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఇంట్లోనే వుండి అజాన్ వినేలా ఈ ఉచిత యాప్ ను రూపొందించాం. అజాన్ సమయంలో మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షంగా ఆడియోను వినవచ్చు అని మహిమ్ జుమా మజీద్ మేనేజింగ్ ట్రస్టీ ఫహాద్ ఖలీల్ పఠాన్ ప్రకటించారు.
ముఖ్యంగా వృద్ధులు, ప్రార్థనలకు రాలేని వారు అజాన్ వినడానికి ఈ ఆన్ లైన్ అజాన్ యాప్ ను తెచ్చినట్లు తెలుస్తోంది. మసీదులో ఏర్పాటు చేసిన 10x15 బాక్స్ స్పీకర్లు సంప్రదాయకంగా వున్న లౌడ్ స్పీకర్ల మాదిరిగా గట్టిగా వినబడటం లేదని, లౌడ్ స్పీకర్లకే అలవాటుపడిన వారికి చాలా కష్టంగా వుందని ,అందుకే ఈ ఆన్ లైన్ యాప్ తెచ్చినట్లు మసీదు నిర్వాహకులు పేర్కొంటున్నారు.
కేవలం మూడు రోజుల్లోనే మహిమ్ జుమా మసీదు సమీపంలోని 500 మంది ఈ యాప్ లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని మహిమ్ జుమా మజీద్ ట్రస్టీ ఫహాద్ ఖలీల్ వెల్లడించారు. ప్రార్థనల కోసం ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని, వారి ప్రాంతాన్ని లొకేషన్ లో ఎంచుకొని, ఆ తర్వాత తమ సమీపంలోని మసీదును ఎంచుకుంటారని వివరించారు.
ఏపీ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు...పన్ను చెల్లింపు వాట్సాప్‌తో చాలా ఈజీగా
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
వాట్సాప్‌లో పన్నులు చెల్లించొచ్చు
పన్నుల చెల్లింపు మరింత సులువు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఆస్తి పన్నులు చెల్లించేందుకు ఆఫీసులు, మీ సేవల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇకపై చాలా ఈజీగా ఆస్తిపన్ను చెల్లించే అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం వాట్సప్ మనమిత్ర ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా గ్రామ పంచాయతీల్లో స్మార్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.. ఆస్తి పన్ను, నీటి కుళాయి బిల్లులు, వ్యాపార లైసెన్స్ ఫీజులు వంటివి ఇకపై స్మార్ట్‌ఫోన్ నుంచే చెల్లించొచ్చు. దీనివల్ల చాలామందికి వారి సొంత ఊళ్లలోని ఆస్తుల పన్నులు చెల్లించడం సులభతరం అవుతుంది. అలాగే పంచాయతీల్లో జరిగే అవినీతిని కూడా అరికట్టవచ్చు అంటున్నారు.
ప్రతి ఏటా పంచాయతీల ద్వారా రూ.822.46 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది.. గతంలో కొన్ని సందర్భాల్లో కొందరు సిబ్బంది డబ్బులు వసూలు చేసి రికార్డుల్లో మాత్రం నమోదు చేయడం లేదు. ఇలాంటి అక్రమాలను అరికట్ట
పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్.. బెయిల్‌కు ఆర్థిక సాయం..
న్యూ ఢిల్లీ :
సాధారణంగా ఎవరైనా నేరం చేస్తే వాళ్లని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తారు. ఆ తర్వాత నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కొంత మొత్తాన్ని చెల్లించాలని ఆదేశిస్తుంది. ఆ డబ్బులు చెల్లిస్తేనే బెయిల్‌పై బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే చాలామంది పేద ఖైదీలు డబ్బులు చెల్లించలేకపోతారు. దీంతో వాళ్లు బెయిల్ మంజూరైనప్పటికీ జైల్లోనే ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే పేద ఖైదీలకు మద్దతు పథకం కింద సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది.
అన్ని రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు, జైళ్లశాఖ డీజీలకు ఇటీవల హోంశాఖ లేఖ రాసింది. ఈ స్కీమ్ కింద అర్హులైన వారి జాబితా రూపొందిస్తే వాళ్లు చెల్లించాల్సిన జరిమానాను కేంద్రమే చెల్లిస్తుంది.అలాగే రిమాండ్‌తో పాటు శిక్షపడిన ఖైదీలకు సైతం ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
రిమాండ్ ఖైదీల జరిమానా మొత్తం రూ.40 వేల లోపు ఉన్నట్లయితే అంత మొత్తం రిలీజ్ చేయాలని ఈ స్కీమ్‌కు సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (CNA)గా ఉన్న జాతీయ నేరాల నమోదు సంస్థని జిల్లా కమిటీ అభ్యర్థిస్తుంది. దీంతో CNA అంత మొత్తం విడుదల చేస్తుంది. ఒకవేళ జరిమానా రూ.40 వేలకు మించి ఉంటే ఆ విషయాన్ని జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీకి తెలియజేస్తుంది. ఈ తర్వాత రాష్ట్ర కమిటీ దీన్ని పరిశీలించి CNAకు రాస్తుంది. దీంతో ఆ మొత్తాన్ని సీఎన్‌ఏ విడుదల చేస్తుంది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఈ స్కీమ్ కింద అర్హులైన ఖైదీల జాబితాను రాష్ట్రాల్లో సిద్ధం చేస్తున్నారు. అయితే డ్రగ్స్, మనీ ల్యాండరింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాల కింద అరెస్టయిన వాళ్లకి ఈ పథకం వర్తించదు.
వర్షాకాలంలో ఈ కూరగాయలను అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా?
వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో వ్యాధులు సులబంగా వ్యాప్తి చెందుతాయి. అలాగే వ్యాధులు రావడానికి ప్రధాన కారణం ఆహరం కూడా. అందుకే, వర్షాకాలంలో తీసుకునే ఆహరం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల ఆహారాలను, కూరగాయలను ఈ వర్షాకాలంలో తినకపోవడమే మంచిదని చెప్తున్నారు. మరి ఆ కూరగాయలు ఏంటి? వాటిని ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో తినకూడని కూరగాయలు:
1.బీరకాయ, సొరకాయ:
ఈ తరహా కూరగాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇవి వర్షాకాలంలో త్వరగా పాడవుతాయి. అలాగే బాక్టీరియా, ఫంగస్ త్వరగా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రకం కూరగాయల్లో ఏది మంచిది. ఏది పాడైంది అని గుర్తించడం చాలా కష్టం. అందుకే వర్షాకాలంలో ఈ కూరగాయలను తక్కువగా తీసుకోవడం మంచిది.
2.ముల్లంగి:
ముల్లంగి భూమిలోపల పెరిగే కూరగాయ. వర్షాకాలంలో ఇలా మట్టి నుంచి వచ్చే కూరగాయల్లో సూక్ష్మజీవులు, బాక్టీరియా, పరాన్నజీవులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి మన శరీరంలో చేరి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు.
3.పచ్చి కూరగాయలు:
వర్షాకాలంలో పచ్చిగా ఉండే కూరగాయలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీరు, తడి వాతావరణం వల్ల బాక్టీరియా వేగంగా పెరుగుతుంది. కాబట్టి సరిగా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇది చర్మ సమస్యలకు కారణం కావచ్చు.
4. ఆకు కూరలు:
నిజానికి మనిషి ఆరోగ్యానికి ఆకు కూరలు చాలా మంచిది. కానీ, వర్షాకాలం మాత్రం వీటికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే, ఈ కాలంలో ఆకు కూరలపై మట్టితో పాటు ఫంగల్ స్పోర్లు ఉండే అవకాశం ఉంటుంది. వాటి వల్ల ఇన్ఫెక్షన్లు రావచ్చు. సరిగ్గా శుభ్రపరచకపోతే వాంతులు, విరేచనాలు లాంటి సమస్యలు రావచ్చు. అయినా సరే తినాలని అనుకుంటే మాత్రం బాగా ఉడికించి తినాలి.
5.మష్రూమ్స్:
ఇవి వర్షాకాలంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఇవి చాలా త్వరగా పాడవుతాయి. వాటిని గుర్తించకపోవడం వల్ల అవి విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాకాలం మష్రూమ్స్ తినడం మంచిది కాదు.
కూరగాయల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నీటి శాతం తక్కువగా ఉండే కూరగాయలను ఎంచుకోవాలి.
ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు.
బాగా ఉడికించి లేదా వేడిగా ఉండే ఆహారంగా తీసుకోవాలి.
రంగు మారిన కూరగాయలు తినకూడదు.
వర్షాకాలంలో శరీరం సహజంగానే కొంత బలహీనంగా ఉంటుంది. పైగా తడి వాతావరణం, వైరస్‌లు, బ్యాక్టీరియా అనారోగ్యాలకు గురి చేస్తాయి. అందుకే కొన్ని కూరగాయలు తినడాన్ని తాత్కాలికంగా నివారించడం మంచిది. దీనివల్ల ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంటుంది.
Bank of Maharashtra Recruitment 2025: నెలకు రూ. 1.5 లక్షల వరకు సంపాదించే అవకాశం!
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారుల కోసం ఒక అద్భుతమైన ఉద్యోగ ప్రకటన చేసింది. 2025-26 సంవత్సరానికి గాను ‘ఇంటర్నల్ ఓంబుడ్స్‌మన్(Internal Ombudsman)’ పోస్టును అగ్రిమెంట్ బేసిస్ లో భర్తీ చేయనుంది. ఈ పోస్టుకు ఎంపికైన వారికి మంచి జీతంతో పాటు ఇతర భత్యాలు కూడా అందించనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యా అర్హత: భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అనుభవం: ఇతర బ్యాంకులలో లేదా ఆర్థిక నియంత్రణ సంస్థలలో జనరల్ మేనేజర్ (GM) స్థాయిలో పనిచేసి రిటైర్ అయినవారు మాత్రమే అర్హులు. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్, రూల్స్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ వంటి రంగాలలో కనీసం 7 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్య గమనిక: అభ్యర్థులు గతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పనిచేసి ఉండకూడదు.
వేతన వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,00,000 జీతం ఉంటుంది. ప్రయాణ ఖర్చుల కోసం రూ.20,000, టెలిఫోన్ బిల్లు రూ. 5,000, ఇంటి అద్దె కోసం రూ.25,000 (లేదా బ్యాంక్ క్వార్టర్స్ సౌకర్యం) ఇస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక పూర్తిగా వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది అభ్యర్థిని ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: అర్హతగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://bankofmaharashtra.in/current-openings ద్వారా అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: 03.జులై.2025
దరఖాస్తు రుసుము: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1,180 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
కావలసిన దృవపత్రాలు: విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
కూతురు ని చంపబోతే అడ్డుపడిన అత్త మమలను నరికిన అల్లుడు
నెల్లూరు జిల్లా లో అమానుషం...సొంత వారిని నరికి చంపిన వెంగయ్య అనే మానవ మృగం
దుత్తలూరులో కూతురును చంపబోగా అడ్డుకున్న అత్త మామలను నరికి చంపిన అల్లుడు
మృతులు జయమ్మ (60),కల్లయ్య (65)గా గుర్తింపు. వెంకాయమ్మ అనే మహిళకు కత్తి గాయాలు.
నెల్లూరు జిల్లా దుత్తలూరు ఏసీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి జంట హత్యలు కలకలం రేపింది. మద్యం మత్తులో భార్య వెంకాయమ్మపై కత్తితో భర్త వెంగయ్య విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు యత్నించిన అత్త జయమ్మ (60), మామ కల్లయ్య (65) లను కత్తితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందారు. భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇక మొబైల్ యాప్తో ఓటింగ్.. దేశంలోనే తొలిసారిగా బీహార్లో అమలు
బీహార్ :
కొద్దిరోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో భారత ఎన్నికల సంఘం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని ఆరు మున్సిపల్ కౌన్సిళ్లకు జరిగే ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా ఓటర్లు మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో మొబైల్ ఫోన్ల ద్వారా ఓటు వేయవచ్చునని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ తెలిపారు.
రాష్ట్ర ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ తెనాలి పట్టణ కమిటీ సభ్యునిగా అబ్బాస్
రాష్ట్ర ముస్లిమ్ యునైటెడ్ ఫ్రంట్ తెనాలి పట్టణ కమిటీ సభ్యునిగా నన్ను నియమించి నియామక పత్రం అందజేసిన తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జనాబ్ షేక్ ఖలీల్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ చేశారు. ముస్లింల అభివృద్ధి కోసం రాజకీయ పార్టీ లకు అతీతంగా అందరం కలిసి నిరుపేద మైనార్టీ ముస్లిం సోదర సోదరీమణులకు మేలు జరగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుదాం అని తెలిపారు.
District - Level initiative To Identify And Admit Out Of School Children
Prakasm District Collector : Tameem Ansariya
Conducted District Level Meeting on Bangaru Balyam and Reviewed the Enrolment Drive-2025 to identify out-of-school children and admit them to suitable classes. Officials were asked to conduct door-to-door surveys, awareness rallies, and focus on SC, ST student admissions. The drive must be completed by July 12.
ఉత్తరాఖండ్‌లో భారీవర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపాలని ఆదేశించింది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో ఈ పది జాతీయ రహదారుల విస్తరణ - డీపీఆర్ తయారీకి కేంద్రం ఆదేశాలు
988 కిలోమీటర్ల విస్తరణకు డీపీఆర్ తయారీకి కేంద్రం ఆదేశాలు - 2025-26 వార్షిక ప్రణాళికలో చేర్చిన మోర్త్
కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 380 కిలోమీటర్ల NH-216ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందులో కత్తిపూడి నుంచి కాకినాడ వరకు 27 కిలోమీటర్లు ఇప్పటికే నాలుగు వరుసలుగా ఉంది. దీనిని ఆరు వరుసలు చేయనున్నారు. మిగిలిన భాగం ప్రస్తుతం రెండు వరుసలు ఉండగా నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.
కర్నూలు నుంచి నంద్యాల, కడప, రాయచోటి, పీలేరు, చిత్తూరు మీదుగా తమిళనాడులోని రాణీపేట వరకు ఉన్న NH-40ని కడప నుంచి చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్ వరకు 148 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించనున్నారు.
శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్ నుంచి సిర వరకు 99 కిలోమీటర్లు 4వరుసలు చేస్తారు.
ఏపీ, కర్ణాటక సరిహద్దు నుంచి కదిరి, ముదిగుబ్బ మీదుగా అనంతపురం వరకు 86 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరిస్తారు. ఇందులో కదిరి, ముదిగుబ్బల వద్ద బైపాస్‌లు కూడా ఉన్నాయి.
పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడులోని కృష్ణగిరి సరిహద్దు వరకు 97 కిలోమీటర్ల
భక్తులందరికీ ఇన్సూరెన్స్ సదుపాయం! - తిరుమలకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు
తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ భవిష్యత్తులో ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీవారి దర్శనార్థం నిత్యం సుమారు 70,000 నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గం, ఘాట్‌రోడ్లు, క్యూలైన్లు తదితర ప్రదేశాల్లో అప్పుడప్పుడు ప్రమాదాలకు గురికావడం, ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడడం, నడక మార్గంలో అడవి జంతువుల దాడి వంటి ఘటనల నేపథ్యంలో భక్తులకు ఇన్సూరెన్స్ కల్పించాలని యోచిస్తున్నారు.
ప్రమాదాలు, జంతువుల దాడిలో మృతిచెందిన వారికి, ఆకస్మిక గుండెపోటుకి బీమాతో చేయూతనందించాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి తిరుమలలో ప్రమాదం బారిన పడి మృతిచెందిన వారికి టీటీడీ 3లక్షల రూపాయల వరకు చెల్లిస్తోంది. ఇప్పుడు అలిపిరి - తిరుమల మధ్య ప్రయాణించే భక్తులకు బీమాను కల్పించాలని చూస్తున్నారు. పెద్దసంఖ్యలో వచ్చే భక్తులకు బీమా కల్పించే సంస్థలు, అవి వసూలు చేసే ప్రీమియం, దాతల సహకారం తదితర అంశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
తిరుమలకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కాలుష్య రహితంగా మార్చేందుకు తిరుమల- తిరుపతి మధ్య డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్తు బస్సులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 50 ఎలక్ట్రిక్ బస్సులు కనుమదారుల్లో తిరుగుతుండగా, మరో 350 బస్సులు విడతలవారీగా రానున్నాయి. ప్రధానమంత్రి ఈ-బస్ సేవా స్కీమ్ కింద కేంద్రం రాష్ట్రానికి ఇప్పటికే 750 విద్యుత్తు బస్సులు కేటాయించింది. ఇందులోంచి 50 బస్సులు ‘తిరుమల- తిరుపతి’ కేటాయించారు. ఇవి కాకుండా తిరుమలకు మరో 300 బస్సులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర గృహ, పట్ణణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాయగా, అక్కడి నుంచి సానుకూల స్పందన వచ్చింది.
మొదటి దశలో కేంద్రం ఇచ్చే 50 బస్సులను మంగళం డిపోనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో రానున్న 300 బస్సుల్లో తిరుమల డిపోనకు 150, అలిపిరి డిపోనకు 50, తిరుపతి ఇంట్రా మోడల్ బస్‌స్టేషన్ నిర్మాణంలో భాగంగా కేటాయించే డిపోనకు 50, శ్రీకాళహస్తి- తిరుపతి మధ్య మరో 50 బస్సులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో తిరుమలలో 150 ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర సాంకేతిక ఏర్పాట్లకు వీలుగా 5 ఎకరాల స్థలం అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఇటీవల ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు
కేంద్రం అనుమతి ఉంటేనే రాష్ట్రాల్లో ట్యాపింగ్. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. 30 రోజుల్లో అమల్లోకి రానున్న కొత్త ప్రతిపాదనలు. రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అధికారాలపై పరిమితులు. ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్‌లు ట్యాప్ చేయాలంటే ఇకపై కేంద్రప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ట్యాపింగ్ అధికారం ఆయా రాష్ట్రాల వరకే పరిమితం. కేంద్ర హోంశాఖ అనుమతి ఉంటేనే ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేసే ఛాన్స్.
ఈ నెల 20న భారతదేశం నుంచి న్యూజెర్సీకి వెళ్లిన సిమ్రన్ అనే యువతి. ఐదు రోజుల తర్వాత
కనిపించకుండా పోయిన యువతి. ఫిర్యాదు అందుకొని ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు.
పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసమే అమెరికా వెళ్లినట్టు తెలిపిన పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ చూడగా.. ఓ చోట ఫోన్ చూస్తూ వేచి ఉన్నట్లు గుర్తింపు.
సిమ్రన్‌కి అమెరికాలో బంధువులు లేరని, ఫోన్ కూడా వైఫై ద్వారా పని చేస్తుందని వెల్లడి
లేబర్ కోడ్స్ రద్దు చేయాలని జూలై 9 సమ్మె ప్రచార సామాగ్రి దొనకొండలో ఆవిష్కరణ
1.కార్మికులు బిట్రిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను అమలు చేయాలి.
2.మోదీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి.
3.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటుధరల చట్టం చేయాలి.
4.కార్మికులకు కనీస వేతనం 26 వేలు అమలు చేయాలి.
5.వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టం పనికి రోజుకి 600 రూపాయలు అమలు చేయాలి.
6.నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి.
7.ప్రభుత్వ రంగ సంస్గల ప్రవేటికరణ చేయడం ఆపాలి.
AP: Girl raped after being given alcohol. This brutal incident came to light late in Prakasam district's Komarolu mandal. A woman from Giddalur and Kane Chandrasekhar from Chennupalle in Kadapa district were having an extramarital affair. In this process, the woman brought her relative, an 11-year-old girl, to a closed restaurant. Chandrasekhar, who was already there, made the girl drink alcohol and raped her. The girl's mother filed a complaint with the police.
బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి చంపేస్తామని బెదిరింపు కాల్
మరికాసేపట్లో చంపేస్తామని.. ఆపరేషన్ కగార్ ఆపాలని బెదిరింపు
తమ టీంలు హైదరాబాద్‌లో ఉన్నాయని.. దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్. రఘునందన్ 2 రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్ర చికిత్స పొందుతుండగా ఫోన్ కాల్. జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ ఫిర్యాదు
ఏపీలోని రేషన్ కార్డుదారులకు షాక్.. ఈసారి కూడా కందిపప్పు సరఫరా లేనట్లే!
అమరావతి :
ఏపీలోని రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్. వచ్చే నెల జూలై లోనూ రేషన్ కార్డుదారులకు కందిపప్పు అందేలా కనిపించడం లేదు. జులై నెలకు సంబంధించి నిత్యావసరాలు ఇప్పటికే చేరుకోగా ఈసారి కూడా కందిపప్పు సరఫరా లేదని అధికారులు చెప్తున్నారు. 2025 మార్చి నెల నుంచి ఏపీలో కందిపప్పు పంపిణీ ఆగిపోయింది. మార్కేట్లో కిలో కందిపప్పు ధర రూ.120 నుంచి రూ.160 వరకూ పలుకుతోంది. రేషన్ దుకాణాల్లో తక్కువ ధర (రూ.67)కే లభించే కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు.
ఏపీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ 100 నుంచి 300 పడకల స్థాయి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించబోతున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో 3,300 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల ఏర్పాటుకు కేంద్రం రూ.1,095 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి 8 నుంచి 14% దాకా పెరిగిందన్నారు.
ఆదిలాబాద్ మున్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్ జాయిన్ అయ్యి పది నెలలే ఇంకా ఉద్యోగం కన్ఫర్మ్ కాలేదు ఇప్పటికే ఎంత మెక్కేసాడో మొన్న 15 లంచం తీసుకొంటూ ACB కి చిక్కేశాడు. ఇలాంటి వారి ఉద్యోగం పీకెయ్యాలి పెన్షన్ ఆపేయాలి ఆస్తి సీజ్ చెయ్యాలి ప్రైవేట్ ఉద్యోగం కూడా రాకుండా చెయ్యాలి బొక్కలో వెయ్యాలి. ఈ పోస్ట్ షేర్ చేసి లంచం తీసుకొనే ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి కింద తడిసేడట్టు చెయ్యాలి మనం .
పెట్టుబడుల పేరుతో విజయవాడలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. లక్ష రూపాయల పెట్టుబడికి రూ.6 వేల వడ్డీ చెల్లిస్తామని మోహిత్ ట్రేడింగ్ కంపెనీ పలువురిని ఆశ పెట్టి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. మొత్తం 1200 మంది నుంచి రూ.300 కోట్లు వసూలు చేసింది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి సంస్థ ఎండీ వెంకట్ ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ లో కలకలం సృష్టించిన నకిలీ ఈ-స్టాంపుల కేసు స్కామ్‌లో-ముగ్గురిపై కేసు
కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన నకిలీ ఈ-స్టాంపుల స్కామ్‌లో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కళ్యాణదుర్గంలో బోయ ఎర్రప్ప నకిలీ ఈ-స్టాంపులు తయారు చేసి విక్రయించాడని ఎస్పీ తెలిపారు.
నకిలీ ఈ-స్టాంపులు విక్రయించి మోసం చేశారని ఎస్ఆర్ ఇన్‌ఫ్రా సంస్థ ఏజీఎం సతీష్ బాబు ఫిర్యాదు మేరకు బోయ ఎర్రప్ప, మోహన్‌బాబు, భువనేశ్వర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వివరించారు. మీసేవ నిర్వహకుడు బోయ ఎర్రప్ప రెండేళ్లుగా 15, 413 స్టాంపులు విక్రయిస్తున్నట్లు నిర్దారించామన్నారు. వీటిలో ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాకు 438 ఈ-స్టాంపులు ఇచ్చారని తెలిపారు. ఈ-స్టాంపుల కోసం బోయ ఎర్రప్ప బ్యాంకు ఖాతాకు ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా రూ.32 లక్షలు బదిలీ చేయగా, అందులో రూ.25.48 లక్షలు కాజేసి ఆ మొత్తానికి నకిలీ ఈ-స్టాంపులు ఇచ్చాడని ఎస్పీ తెలిపారు.
పొదిలి టైలర్స్ కాలనీలో దర్శి డి.ఎస్.పి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు....అనుమానితగల 37 మోటార్ బైకులు, రెండు ఆటోలు, ఒక కార్ ను సిజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్కిల్ పోలీస్ సిబ్బంది
Telangana Govt Grant Pensions to HIV Victims, Minister Seethakka Announces
TG: Minister Seethakka said on Saturday that new pensions will be granted to HIV victims in the state soon. He said that so far 36 thousand HIV victims in the state are receiving pension. Including the new ones, more than 50 thousand people will receive financial assistance. He said that more than 13 thousand applications are under consideration, they will be verified and sent to the Finance Department. He said that pensions will be granted as soon as they are approved.
బిగ్ బాస్ 9లోకి వెళ్లాలని ఉందా.. అప్లై చేసుకోండిలా
బిగ్బాస్-9 కోసం 'కాల్ ఫర్ ఎంట్రీస్' పేరుతో ఆసక్తికర వీడియోను విడుదల చేసింది బిగ్బాస్ టీమ్. ఈసారి సెలబ్రిటీలతో పాటు కామన్ ఆడియన్స్కు కూడా హౌస్లోకి ఎంట్రీ ఛాన్స్ ఉందని నాగార్జున ప్రకటించారు. బిగ్బాస్ను ప్రేమించే ప్రేక్షకులకు ఇది రిటర్న్ గిఫ్ట్ అంటూ పేర్కొన్నారు. రిజిస్టర్ అయి, బిగ్బాస్లోకి రావాలన్న కారణాన్ని చెప్పే వీడియోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
https://bb9.jiostar.com
బెంగుళూరు టు గుంటూరు డ్రగ్స్ రవాణా–స్మగ్లర్ల అరెస్ట్
చిలకలూరిపేట: బెంగుళూరు నుండి గుంటూరుకు అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు ఈరోజు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 25 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన నిందితులు చల్లా గోపి (23), తండ్రి లేట్ కోటేశ్వరరావు, వడ్డెర కులం, చిరునామా డి. నం. 5-64-34, 2/19వ లైను, బ్రాడీపేట, గుంటూరు టౌన్ మరియు షేక్ ఫారుక్ (29), తండ్రి షాకీర్, ముస్లిం కులం, చిరునామా చెక్కల బజార్, సంగడిగుంట, గుంటూరు టౌన్ గా గుర్తించారు.నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం, వారిని రిమాండ్‌కు పంపినట్లు చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
కార్పస్ ఫండ్ చెక్కులను పోలీస్ కుటుంబ సభ్యులకు అందించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
ది.17.04.2025 తేదిన అనారోగ్యంతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ G.వీరయ్య సతీమణి సౌజన్య లక్ష్మీ గారికి మరియు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ది.21.04.2025 తేదీన మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ K.క్రాంతి కుమార్ సతీమణి శ్రీమతి K. ప్రవీణ గారికి కపోలీస్ శాఖా తరపున అదనపు కార్పస్ ఫండ్ నిధి ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.100,000/- చొప్పున రూ.2,00,000/-- రూపాయలను ఎస్పీ చేతుల మీదుగా గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో శ్రీ అద్దంకి. వెంకటేశ్వర రావు గారు అందజేయడం జరిగింది.
మరణించిన పోలీస్ కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా కల్పించారు.
కరవాది గ్రామానికి చెందిన యువతికి కేంద్ర న్యాయశాఖ లో ఇంటర్న్ షిప్ అవకాశం
ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలం ఒక చిన్న గ్రామం కరవది నుంచి వచ్చిన విద్యార్థినికి అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం లో 5 వ సంవత్సరం న్యాయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని సత్యాల అంజన్ భారత ప్రభుత్వం న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన న్యాయ వ్యవహారాల విభాగం (Department of Legal Affairs) నిర్వహించే జూలై 2025 నెల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాములో ఎంపికయ్యారు.
ఈ ఇంటర్న్‌షిప్ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయమైన మెయిన్ సెక్రటేరియట్, శాస్త్రి భవన్, న్యూ ఢిల్లీలో జులై 1 నుండి ప్రారంభమవుతుంది. విద్యార్థినికి ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా న్యాయ విధానాలపై ఆచరణాత్మక అవగాహన, అనుభవం పొందే అవకాశం లభించనుంది. దేశం మొత్తం మీద 50 మందినే ఎంపిక చేస్తారు కాగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఈమె ఎంపిక అయ్యారు.
ఇది అసాధారణ రీతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నేరుగా పని చేసే అరుదైన అవకాశం కావడం విశేషం. విద్యార్థిని తన ప్రతిభతో దేశవ్యాప్తంగా ఉన్న అనేక పోటీదారులను అధిగమించి ఈ అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ అవకాశాన్ని ఆమె తన భవిష్యత్ న్యాయ ప్రస్థానానికి ఒక మైలురాయి గా భావిస్తున్నారు..
రాష్ట్ర ప్రభుత్వ అతిధి గా మౌలానా అసద్ మదిని కి స్వాగతం పలికిన ఫారూఖ్ షుబ్లీ
ఆంధ్ర రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి NMD ఫరూఖ్ సూచనల మేరకు జమియత్ ఉలేమా ఏ హింద్ జాతీయ అధ్యక్షులు హజ్రత్ మౌలానా మహమూద్ అసద్ మదని ను రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా తిరుపతి విమానాశ్రయంలో స్వాగతం పలకటం జరిగింది. మౌలానా హుస్సేన్ , ముఫ్తీ ఇలియాజ్ కూడా ఉన్నారు.
బ్రేకింగ్ న్యూస్
మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి.
ఆఫీస్ అద్దాలు ధ్వంసం
ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీయార్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం
కార్లు ధ్వంసం .. ఇంకా కొనసాగుతున్న దాడి
స్టూడియోను ధ్వంసం చేసిన కార్యకర్తలు
TEL నెంబర్ లేకుండా పత్రిక లో ఊహాజనిత వార్తలు రాస్తే చర్యలు తీసుకోండి... PRGI కఠిన ఆదేశాలు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కు ఆదేశాలు .. త్వరలో జిల్లా DPRO లకు ఉత్తర్వులు.
PRESS REGISTRAR GENERAL OF INDIA
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పై అ సత్య వార్తలు ప్రచురిస్తూ, దేశంలోని ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ హరించే విధంగా కొన్ని RNI లేని పత్రిక లు సత్య దూరం లేని వార్తలు ప్రచురించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసంఖ్యాధికంగా పి డి ఎఫ్ పత్రికలు సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు సృష్టిస్తున్నాయని వీటిపై చర్యలు తీసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణ జిల్లా సీనియర్ పాత్రికేయులు ఎస్ నరహరి నాగేశ్వర ప్రసాద్,PRGI. న్యూ ఢిల్లీ అప్పీలు చేయగా ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సదరు పిర్యాదు పై లోతుగా అధ్యయనం చేసి RNI లేని పత్రికలపై వేటు కు రంగం సిద్ధం చేసింది కఠిన ఆదేశాలు జరీ చేస్తూ ఇక ముందు RNI లేని పత్రికల వార్తలను ప్రామాణికంగా తీసుకోవద్దని తప్పుడు వార్తలు ప్రచురిస్తే చట్ట పరమైన చర్యలకు వెనుకాడబోవద్దని, అలాగే పత్రిక భాషలో వాడాల్సిన పదాలు పూర్తి స్థాయిలో పొందుపరిచి ఉత్తర్వులు జారీచేసింది దీని గమనించి రాష్ట్ర జిల్లా పౌరసంబంధాల అధికారులు పరిగణించాలని ఆర్ ఎన్ ఐ లేని పత్రికల పూర్తి సమాచారాన్ని సదరు జిల్లా పౌరసంబంధాల అధికారులు సేకరించి రాష్ట్ర కార్యాలయాలకు పంపాలని ఆదేశాలు జరీ చేశారు.
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీ న్యూస్‌లో యాంకర్‌గా విధులు నిర్వహిస్తున్న స్వేచ్ఛ పూర్ణ చందర్ (40) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో తన నివాసంలో ఆమె ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
స్వేచ్ఛ గతంలో తన తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవితో కలిసి రామ్ నగర్‌లోని వైఎస్సార్ పార్క్ సమీపంలో నివసించగా, ఇటీవల జవహర్ నగర్‌లోని ఒక ఇంటికి మారినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. స్వేచ్ఛ తల్లి శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఒక వ్యక్తితో మనస్పర్థల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
స్వేచ్ఛ గత 18 సంవత్సరాలుగా టీవీ9 సహా పలు తెలుగు న్యూస్ ఛానళ్లలో జర్నలిస్ట్‌గా, యాంకర్‌గా పనిచేస్తూ తనకంటూ గుర్తింపు సంపాదించారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఆమె ఈసీ మెంబర్‌గా ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్య మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.