వైసీపీ మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పుట్టా ఫైర్
కడప జిల్లా మైదుకూరు
వైసిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామి రెడ్డి మైదుకూరు ప్రస్తుత ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు ఆయన ఆరోపణలకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కౌంటర్ ఎటాక్
మాచునూర్ చంద్ర అనే వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి మిమ్మల్ని చీకొట్టి బయటికి వచ్చారు..
నా దగ్గర డబ్బు తీసుకున్నారు అన్యాయం చేశారు అని చంద్ర మీడియా ముఖంగా చెప్పారు..
దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు అంటే మీరు తీసుకున్నట్లే కదా..మీరు ఆయనకు సమాధానం చేప్పాలి. .
మున్సిపల్ ఎన్నికల్లో మా దనపాల జగన్ మీద కేసులు పెట్టి ఎంత హింసించారో తెలియదా..
పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి కోర్టుకు పంపిస్తే జడ్జిగారు బెయిల్ ఇచ్చారు..
పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలతో ఎన్నికలు జరిపి మా బీఫారం మీద గెలిచిన వ్యక్తిని మా ఇంటి నుండి తీసుకెళ్లి మాపై కిడ్నాప్ కేసులు పెట్టారు. .
ధనపాల జగన్ మీద ఈరోజే ఎందుకో ప్రేమ పుట్టుకొచ్చింది ఇన్నాళ్లు ఎందుకు లేదు...
మాచునూరు చంద్ర దగ్గర చైర్మన్ ను చేస్తామని డబ్బు తీసుకున్నారు కాబట్టి మా దగ్గర ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి చైర్మన్ ను చేశారు..
మా కార్యకర్తల కోసం కష్టపడ్డంఅంటున్నారు ఇదేనా మీ కష్టం..
మీకు ఛాలెంజ్ చేస్తున్న మీ మద్దతు మాకు అవసరం లేదు..
మీ కౌన్సిలర్లను రాజీనామా చేపించు మా అభ్యర్థిని చైర్మన్లు చేస్తా..
మీరు నాకు కాదు సమాధానం చెప్పాల్సింది మాచూనూరు చంద్రకు చెప్పండి..
మా మధ్య వర్గ పోరు పెట్టాలని భావించి మీరు ప్రెస్ మీట్ పెట్టారు..
అవినీతి గురించి మీరు మాట్లాడారు 2014 నుండి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నది మీరు కాదా..
మున్సిపాలిటీ లో రెసుల్యూషన్ పాస్ చేసింది మీరు కదా ఆరోజు ఎందుకు ప్రశ్నించలేదు అవినీతిపై..
అందులో మీకు వాటా ఉంది కాబట్టి ఆ రోజు మీరు మాట్లాడలేదు..
అవినీతి గురించి మాట్లాడే హక్కు రఘురాం రెడ్డికి లేదు..
తిప్పిరెడ్డిపల్లి చెరువులో మట్టి గురించి వాస్తవం తెలుసుకొని మాట్లాడాలి..
సబ్ కాంట్రాక్టర్లు మా దగ్గర పనిచేసేటప్పుడు వారి వాహనాలపై మా పేరు వేసుకుంటారు..
దిలీప్ బిలికన్, మెగా కంపెనీలలో పని చేసేటప్పుడు వాహనాలపై మా పేరు వేసుకున్నారు..
అవినీతి మీ ప్రభుత్వంలో నాగసాని పల్లె కొండల్లో జరిగింది..
దానిలో మీకు సంబంధం లేదా? నిరూపించాలా..
మీరు భూములను రిజిస్ట్రేషన్ చేయించుకొని వారిని బజారుపాలు చేసింది గుర్తులేదా..
మేము ఎప్పుడూ అవినీతికి పాల్పడం ప్రజలకు సేవ చేయాలనే వచ్చాం..
ఎవరు పనిచేస్తే వారికి ప్రజలు ఓట్లు వేస్తారు.. అవినీతిపరులు మీరు..
నంద్యాలంపేట దగ్గర వందల ఎకరాల ఫారెస్ట్ భూమిని మీరు ఆక్రమించలేదా...
నేను ఆనాడు చాలెంజ్ చేశాను ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తే సన్మానం చేస్తానని..
తరువాత దానికి మీద మీ సమాధానం లేదు.. మూడు సంవత్సరాలు కోర్టు లో పోరాటం చేశాం..
తరువాత ప్రభుత్వం దానిని తీసుకుంది..
సబ్ కాంట్రాక్టర్ల వాహనాల మీద నా పేరు ఉంటేనేనుఅవినీతిచేశాఅని మీరు మాట్లాడితే ప్రజలు నవ్వుతారు..
ఇసుకలో మీరు ఎంత దోచుకున్నది ప్రజలకు తెలియదా.. కుందూ నదిలో మట్టి అమ్ముకొని డబ్బు తీసుకుంది మీరు కాదా..
రైతుల దగ్గర్నుండి పసుపుకు కమీషన్ తీసుకుని లక్షలు దండుకుంది మీరు కాదా..
ఎర్ర చెరువుకు మూడుసార్లు నీటిని నింపిన ఘనతమాది.. ప్రజలు తాగినీటి కోసం ఎంత అల్లాడింది మీకు తెలియదా..
పదివేల రూపాయల నీటిని తోలి 90000 తీసుకోరున్నారు అనేది మీకు తెలుసు నాకు తెలియదు..
ఆనాడు ఎస్ ఆర్ 1 లో నీరు ఉన్నా కూడా వదలక ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడ్డారు.
ఎర్ర చెరువు కోసం శాశ్వత జీవోను తీసుకొచ్చాను..
శెట్టివారిపల్లె చెరువుకుని చరిత్రలో ఎప్పుడైనా రెండుసార్లు నీటిని నింపావా ప్రజలను అడగండి.
మేము అన్నా క్యాంటిన్ లో పేదలకు అన్నం పెడితే మీరు అన్నా క్యాంటీన్లో మందు అమ్మిన చరిత్ర మీ ప్రభుత్వానిది..
మీరు మీ ప్రభుత్వం మద్యం లో దోచుకున్నారు..
మీ అరాచక పాలనకు 151 సీట్లు నుండి 11 సీట్లకు పరిమితమయ్యారు..
అవినీతి గురించి మాట్లాడే హక్కు రఘురాం రెడ్డికి లేదు.. మేము ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను సేవ చేస్తాను.