Oyo: డిగ్రీ కూడా చదవని కుర్రాడి 60 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్య సక్సెస్ సీక్రెట్
ఓయో రూమ్స్... డిగ్రీ కూడా చదవని కుర్రాడి 60 వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం వెనకున్న ఒకే ఒక సక్సెస్ సీక్రెట్.
ఓయో (OYO)... ఈ బోర్డు చూస్తే మీ మనసులో ఏమనుకుంటున్నారో పెద్దగా ఆలోచించకుండానే చెప్పొచ్చు. అవన్నీ పక్కన పెడితే అసలు ఓయో గురించి మీకు ఏమి తెలుసు?
పేరు చూసి ఉబెర్ లా ఇదేదో విదేశీ కంపెనీ అనుకుంటున్నారు కదా? కానీ కాదు ఒక ఇండియన్ కంపెనీ. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా ఇది మొదలుపెట్టిన వాడు ఒక 19 ఏళ్ళ కుర్రోడు. ఇప్పుడు ఓయో వ్యాపార సామ్రాజ్యం విలువెంతో తెలుసా 60000 కోట్లకు పైమాటే. ఈ స్టోరీ చదివితే మీకు మరిన్ని ఆశ్చర్యపోయే విషయాలు తెలుస్తాయి...
రితేష్ అగర్వాల్...ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు. సొంతూరు ఒడిస్సా రాష్ట్రంలో రాయగఢ్. ఇతనేమీ పెద్దగా చదువుకో లేదు. సరిగా చెప్పాలంటే డిగ్రీ కూడా పూర్తిచేయలేదు. పోనీ బ్యాక్ గ్రౌండ్ గట్టిదేమో అనుకుంటే నాన్న ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవాడు. ఇతను 13 ఏళ్ళ వయసులోనే కుటుంబానికి సహాయపడటానికి సిమ్ కార్డులు అమ్మేవాడు. మెల్లగా డిగ్రీ వరకు గెంటుకొచ్చినా ఈ చదువు కొనసాగించేలేక బిజినెస్ మీద దృష్టి సారించాడు. తను పని మీద ఒక రోజు రాత్రి హోటల్ లో స్టే చెయ్యాల్సి వచ్చినప్పుడు ఎదుర్కున్న పరిస్థితులే అతనికి ఈ వ్యాపారం లో అడుగుపెట్టేలా ప్రేరేపించాయి. దాంతో అతను ముందుగా oravel stays అనే ఒక బుకింగ్ వెబ్ సైట్ ను మొదలుపెట్టాడు. అందులో అందుబాటు ధరల్లో ఉండే హోటళ్ల లిస్ట్ ఉండేది. అయితే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి డబ్బు లేకపోవడం తో ఇబ్బందిపడేవాడు. అదే సమయంలో కొత్తగా స్టార్ట్ అప్ లను పెట్టి వ్యాపారవేత్తలు కావాలనుకునే వారికోసం Pay Pal ఓనర్ ఇచ్చే లక్ష డాలర్ల Theil Fellowship గెలుచుకుని ఆ పెట్టుబడితో వ్యాపారాన్ని వృద్ధి చేసాడు.
అలా 2013 లో మొదలయ్యింది ఓయో ప్రస్థానం. మొదటగా ఇక్కడ బడ్జెట్ హోటల్ లలో ఉండే సమస్యలు అర్థం చేసుకున్నాడు రితేష్. తక్కువ కాస్ట్ హోటల్స్ లో ఉండే అతిపెద్ద సమస్య శుభ్రత లేకపోవడం. సో దానిమీద దృష్టిపెట్టాడు. మొదట్లో తనవద్ద లిస్టయిన హోటల్స్ తో రెవిన్యూ షేరింగ్ పార్టనర్ షిప్ తీసుకునేవాడు రితేష్. వాటిల్లో కావాల్సిన మార్పులు చేసేవాడు. వాటర్, నీట్నెస్, ఇంటర్నెట్ ఫ్రీగా ఇవ్వడం లాంటి సౌకర్యాలతో పాటు ఈజీ గా బుక్ చేసుకునే అవకాశం కలిపించాడు. లోకల్ ఐడెంటిటీ కార్డులతో ఎవరైనా జంటలు ఈజీ గా రూమ్ బుక్ చేసుకునే ఫెసిలిటీ కలిపించాడు. దాంతో ఓయో సక్సెస్ మొదలయ్యింది. ఓయో లో లిస్టయిన హోటల్స్ కి రెవిన్యూ, బుకింగ్స్ పెరగటంతో ఓయో తో పార్టనర్షిప్ కోసం మరిన్ని హోటల్స్ ముందుకొచ్చాయి. దాంతో కంపెనీ 2015 నాటికి దూసుకుపోయింది. అప్పుడు ఈ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంకు నుంచి ఫండింగ్ తీసుకుని వరల్డ్ మార్కెట్ మీద కన్నేశాడు రితేష్.
ఎప్పటికప్పుడు తన వ్యాపార స్ట్రాటజీ ని మార్చుకుంటూ దూసుకెళ్లాడు. బుకింగ్స్ తో సంబంధం లేకుండా నిమం గ్యారంటీ ఇన్కమ్ వంటి కొత్త కొత్త పధకాలు పెట్టి పార్టనర్స్ ను పెంచుకున్నాడు. 2018 నుండి సర్వీస్ అపార్ట్మెంట్స్ అండ్ కార్పొరేట్ స్టే లపై దృష్టిపెట్టింది. ఇప్పుడు ఓయో రూమ్స్ ప్రపంచం లో దాదాపు 80 కంటే ఎక్కువ దేశాల్లో పాతుకుపోయింది. 40 వేల హోటల్స్ 17 వేలకంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక పెట్టుబడిదారులు కూడా పెరిగారు.
ఈలోగా కోవిడ్ రూపంలో ఒక పెద్ద షాక్ తగిలింది. దాంతో వ్యాపారం పూర్తిగా దెబ్బ తినిపోయింది. మరోవైపు IPO కు వచ్చినా సెబీ ఎంక్వయిరీ కి ఆదేశించడం వంటి కారణాలతో IPO నుండి వెనక్కు తగ్గింది. కంపెనీ పనైపోయిందనుకున్నారందరూ. మరో బైజూస్ లా ఓయో కూడా మునిగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. దాంతో లాభాలు ఇవ్వని హోటల్స్ ను వదిలించుకుని. మళ్ళీ రెవిన్యూ షేరింగ్ లో కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ లాభాల్లోకి వచ్చింది.
ఎందుకు ఓయో ఇంత సక్సెస్ అయిందంటే:
దీనివెనుకున్న మాస్టర్ మైండ్ ఓన్లీ రితేష్ అగర్వాల్. ఎప్పటికప్పుడు మార్కెట్ అర్థం చేసుకుంటూ ముందుకు సాగటమే అతని సక్సెస్ సీక్రెట్. ఒకప్పుడు హోటల్స్ లో జంటలు స్టే చేస్తే రైడింగ్ లాంటి ఇబ్బందులు ఉండేవి. దాంతో అందరికి భయం ఉండేది. అయితే ఓయో రూమ్స్ లో అటువంటి ఇబ్బందులు ఉండకపోవడంతో కపుల్స్ కు ఓయో రూమ్స్ స్వర్గంలా మారాయి. దాంతో వారు ఎక్కువగా రావడంతో ఓయో మీద కేవలం పెళ్లికాని యువతకే అనే ముద్రపడిపోయింది. కానీ ఇది నిజం కాదు. ఓయో రూమ్స్ ఎక్కువగా టెంపుల్స్ ఉండే ప్రాంతాల్లో బుకింగ్స్ ఎక్కువగా అవుతాయట. కేవలం జంటలకు ఇవ్వడమే ఓయో సక్సెస్ కు రీజన్ కాదు. ఎప్పటికప్పుడు బిజినెస్ స్ట్రాటజీ మార్చుకోవడం, గెస్టులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఇలా ప్రతీ విషయంలో ఉండే కేర్ ఈ రోజు ఓయో ను ఈ స్థాయి లో నిలబెట్టింది. మరోపక్క ఫ్యామిలీలను మరింతగా హోటల్స్ కు వచ్చేలా చెకిన్ పాలసీ నీ మార్చింది. పార్టనర్ హోటల్స్ ఓకే అయితేనే జంటలకు రూమ్ ఇవ్వొచ్చు అని కొత్త నిబంధన పెట్టింది. అయితే ప్రస్తుతం ఈ నిబంధనలు దేశంలో ఉన్న అన్ని హోటల్స్ కు వర్తించవు.
సో ఇది ఒక డిగ్రీ కూడా చదవని ఒక కుర్రోడి విజయగాధ. ఇతని విజయం ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కూడా ఆశ్చర్యపరిచింది. 2020 లో ఇండియా కు వచ్చినప్పుడు ( అప్పుడు ట్రంప్ అధ్యక్షుడు కాదు) నీది చిన్న కంపెనీ కాదు రితేష్, గుడ్ జాబ్ అని పొగిడేలా చేసింది. వ్యాపారం చేయాలంటే డబ్బే కావాలనే ఆలోచన కంటే వ్యాపారం చెయ్యాలంటే కావలిసింది ఒక కొత్త ఆలోచన అనే విషయాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన బిజినెస్ మెన్. సో వ్యాపారమే మీ టార్గెట్ అయితే ఈ సక్సెస్ స్టోరీ నుండి మీరు నేర్చుకొవలిసింది చాలా ఉంది కదా. ఏమంటారు? ఇంతకీ OYO అంటే ఏంటో తెలుసా On Your Own!
పాలకొల్లు టూ NASA: అంతరిక్ష చరిత్రలో నిలిచిన తెలుగు తేజం జాహ్నవి! ఈమె విజయాలు తెలుసా?
కలలు కనడం అందరూ చేస్తారు, కానీ వాటిని నిజం చేసుకునే వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ఒకరే మన తెలుగు అమ్మాయి, జాహ్నవి డాంగేటి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న పట్టణం పాలకొల్లు నుండి బయలుదేరి, భారత అంతరిక్ష చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె ప్రయాణం కేవలం ఒక విజయం కాదు, లక్షలాది మంది యువతకు, ముఖ్యంగా అమ్మాయిలకు ఒక గొప్ప ప్రేరణ.
ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు పట్టణానికి చెందిన జాహ్నవి డాంగేటి, అమెరికాలోని నాసా (NASA) నిర్వహించిన అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ (IASP)ను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. ఈ అద్భుతమైన ఘనతతో, ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. ఆమె కేవలం ఒక విజేతగా నిలవడమే కాకుండా, STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) రంగాల్లో మహిళలు రాణించడానికి ఒక రోల్ మోడల్‌గా మారారు.
చరిత్ర సృష్టించబోయే టైటాన్స్ మిషన్
జాహ్నవి ప్రతిభకు గుర్తింపుగా, ఆమెకు మరో అరుదైన అవకాశం లభించింది.
ప్రాజెక్ట్: టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్ (అమెరికాలో అభివృద్ధి చేస్తున్న వాణిజ్య అంతరిక్ష కేంద్రం).
మిషన్: 2029లో చేపట్టబోయే తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర.
ప్రత్యేకత: ఈ చారిత్రాత్మక మిషన్‌కు ఎంపికైన తొలి భారతీయుల్లో జాహ్నవి ఒకరు.
భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనలకు, వాణిజ్య కార్యకలాపాలకు వేదిక కానున్న ఈ ప్రాజెక్ట్‌లో ఆమె భాగం కావడం, ఆమె అంతర్జాతీయ స్థాయి నైపుణ్యానికి నిదర్శనం.
విజయానికి పునాది: విద్యాభ్యాసం & కుటుంబ ప్రోత్సాహం
జాహ్నవి పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. తన ఇంటర్మీడియట్ విద్యను పాలకొల్లులోనే పూర్తి చేశారు. ప్రస్తుతం కువైట్‌లో ఉద్యోగాలు చేస్తున్న ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీలు తమ కుమార్తె కలలకు వెన్నుదన్నుగా నిలిచారు.
శిక్షణ, పరిశోధన: అంతరిక్షానికి భూమిపైనే రిహార్సల్స్:
అంతరిక్షయానం అంత సులభం కాదు. దానికి కఠినమైన శిక్షణ అవసరం. జాహ్నవి ఈ క్రింది శిక్షణలలో పాల్గొన్నారు:
అనలోగ్ మిషన్లు: భూమిపైనే అంతరిక్షం లాంటి పరిస్థితులను సృష్టించి శిక్షణ పొందడం.
డీప్ సీ డైవింగ్: సముద్ర గర్భంలో వ్యోమగాములకు ఎదురయ్యే ఒత్తిడిని అనుభవించడం.
స్పేస్ సిమ్యులేషన్: అంతరిక్ష ప్రయాణాన్ని కంప్యూటర్ల ద్వారా అనుభూతి చెందడం.
జియాలజీ శిక్షణ: వేరే గ్రహాలపై ఉండే భౌగోళిక నిర్మాణాలపై పరిశోధన. (ఈ శిక్షణ పొందిన తొలి భారతీయురాలు ఈమే!)
ఆమె పేరున ఒక గ్రహశకలం!
జాహ్నవి కేవలం శిక్షణకే పరిమితం కాలేదు. International Astronomical Search Collaboration తో కలిసి పనిచేస్తూ, Pan-STARRS టెలిస్కోప్ డేటాను విశ్లేషించి ఒక కొత్త అస్థిర గ్రహశకలాన్ని (asteroid) కనుగొన్నారు. ఇది ఆమె శాస్త్రీయ పరిశోధనా పటిమకు ఒక గొప్ప ఉదాహరణ.
ముళ్ళ పొదల్లో దొరికిన అమ్మాయి, IAS కావడమే లక్ష్యం గా...
పూజా ఈమాన్:
2008లో తిరుపతి సమీపంలోని రేణిగుంటలో మతిస్థిమితం లేని ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చి ముళ్లపొదల్లో పడేయగా, స్థానికులు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రాజా ఫౌండేషన్‌కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పాపను, సమీపంలో ఉన్న తల్లిని మైలవరంలోని రాజా ఫౌండేషన్‌కు తీసుకెళ్లారు.. ఆ చిన్నారికి మంచి పేరు పెట్టాలని కోరుతూ ఫౌండేషన్ నిర్వాహకుడు రాజారెడ్డి, అబ్దుల్ కలాంకు లేఖ రాయగా ఆయన పూజా ఈమాన్ అని నామకరణం చేశాడు. కొన్ని రోజులకు రాజారెడ్డి ఆ చిన్నారి పేరుతోనే ప్రొద్దుటూరు మండలం చౌడూరులో పూజా ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకూ అదే స్కూల్‌లో పూజా చదువుకుంది. పదో తరగతిలో 500 మార్కులకు 428 మార్కులు సాధించింది. ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జాగ్రఫీ (హెచ్‌పీజీ)లో చేరింది.. ఫస్ట్ ఇయర్ 475కి 466, సెకండ్ ఇయర్‌లో 1000కి 985 మార్కులతో సత్తా చాటింది, ఇంటర్ చదివే సమయంలో రాజారెడ్డి కన్నుమూయడం తీవ్రంగా కలచివేసింది.. అనాథ అనే భావన రాకుండా రాజారెడ్డి సర్ నన్ను పెంచారు. నేను కలెక్టర్ కావాలనేది ఆయన కల, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడి చదువుతా. పేదలకు, ప్రధానంగా నాలాంటి అనాథలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలన్నదే నా ధ్యేయం అని పూజా ఈమాన్ తెలిపింది.
డా తాడివలస దేవరాజుకు కృతి ఫౌండేషన్ వారు అవార్డు అందజేశారు
కృతి ఫౌండేషన్ అధినేత శ్రీమతి అశ్విని ఆధ్వర్యంలో కృతి పౌండేషన్ ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చీరాల రోటరీ క్లబ్ నందు వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న వారికి పురస్కారాలు అందించారు . ముఖ్య అతిధులుగా టీడీపీ యువ నాయకులు మద్దలూరి అమర్నాథ్, జమ్మలమడక నాగ మణి,జేడీ డాక్టర్ బాబీ రాణి, చిన్న గంజాం యం.ర్ .ఓ జె.ప్రభాకర రావు, సి ఐ సూరేపల్లి సుబ్బా రావు , మెరైన్ సి ఐ సింగిరీసు సాంబ శివ రావు. డాక్టర్ అమృతపాణి ,గౌరవ అధ్యక్షులు ఆకురాతి వెంకట వరప్రసాద్ రావు పాల్గొన్నారు . వైద్య , సామాజిక , ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ తాడివలస దేవరాజు కు డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలాం జాతీయ సేవ రత్నా అవార్డు తో సత్కరించారు.
ఈ సందర్భంగా టిడిపి యువ నాయకులు మద్దులూరి అమర్నాథ్ మాట్లాడుతూ కృతి ఫౌండేషన్ ఐదు సంవత్సరాలుగా చేస్తున్న సేవలను కొనియాడి, చీరాలలో జరుగు సేవా కార్యక్రమాలకి కృతి ఫౌండేషన్కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ కృతి ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చీరాల లో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృతి ఫౌండేషన్ సభ్యులు , ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల లోనే వివిధ సేవా రంగాలలో ఉన్నటువంటి ప్రముఖులకు అవార్డు అందచే,సి వారి సేవలను తెలియజేశారు
బీర్కూర్ మండల బీజేపీ యువ నాయకుడు వడ్ల బస్వరాజ్ గారితో న్యూస్ రీడ్ ముఖాముఖి
బీర్కూర్ మండల యువనాయకుడు వడ్ల బస్వరాజ్ గారితో న్యూస్ రీడ్ ఇంటర్వ్యూ నిర్వహించింది ,రాజకీయ భవిష్యత్ గురించి , రాజకీయ సమీకరణాలు కార్యాచరణ పద్ధతి గురించి న్యూస్ రీడ్ రిపోర్టర్ తో షేర్ చేసుకున్నారు పైన ఉన్న లింక్ ఓపెన్ చేసి చూడండి .
న్యూస్ రీడ్ ఆప్ లో మీ వ్యాపార రాజకీయ ఇంటర్వ్యూలకోసం వెంటనే కాల్ చేయండి , ఫోన్ : 8125023601 .
న్యూస్ రీడ్ ఆప్ ని ప్లే స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
అనారోగ్యంతో బాధపడుతున్న BRS నాయకుడికి 10 లక్షలు ఆర్థిక సహాయం
అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ నాయకుడికి రూ.10 లక్షలు ఆర్ధిక సహాయం చేసిన కేసీఆర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖమ్మం టౌన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డోకుపర్తి సుబ్బారావు విషయం తెలుసుకొని తన నివాసానికి పిలుచుకొని, వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షల చెక్కును స్వయంగా అందజేసిన కేసీఆర్
ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా అవార్డు గ్రహిత బి ఆర్ అంబేద్కర్
*ఉత్తమ జిల్లా ఎన్నికల అధిక
విజయనగరం, జనవరి 25:
ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విజయవాడలో శనివారం అవార్డు స్వీకరించారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, 5వ బెటాలియన్ కమాండెంట్ మలికా గార్గ్ కూడా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అవార్డులు స్వీకరించారు.