Select Location
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడర్ తాళ్లూరు
ఒంటి పూట బడుల సమయం మార్పు
AP: ఒంటి పూట బడుల సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. టెన్త్ పరీక్ష పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మ.1.15 గం.కు స్కూళ్లు ప్రారంభమయ్యేవి. ఇక సా. 5 గంటలకు పాఠశాలలను మూసివేయనున్నారు.
View More
Education
18 Mar 2025 10:35 AM
0
6
Newsread Image

No.1 Short News

Newsread
పాఠశాలల వేధింపులకు చెక్.. వాట్సాప్‌ ద్వారా టెన్త్ హాల్ టికెట్లు అందుకున్న ఏపీ విద్యార్థులు
ఏపీలోని టెన్త్ విద్యార్థులు తొలిసారి వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు అందుకున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల వేధింపులకు అడ్డుకట్ట పడింది. పూర్తి ఫీజు చెల్లించలేదంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను తమ వద్దే పెట్టుకుని వేధింపులకు దిగుతున్నట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు నేరుగా విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నంబర్లకే హాల్ టికెట్లను పంపింది. దీంతో వారు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇలాంటి విధానం అమల్లోకి రావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఇటీవల ఇంటర్ విద్యార్థులు కూడా ఇలాగే వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు అందుకున్నారు. ఈ విధానంపై తల్లిదండ్రులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ సాయంతో ఎవరికి వారు నేరుగా తమ హాల్ టికెట్లను తీసుకుంటున్నారు.
View More
Education
05 Mar 2025 10:23 AM
0
32
Newsread Image

No.1 Short News

DR Local News - Chirala
సైన్స్ తోనే సమాజ అభివృద్ధి
చీరాల : ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోనే విదంగా కృషి చేస్తామని చీరాల ఆర్కే ఓరియన్టల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ అనీల్ కుమార్ అన్నారు. పాఠశాల ఆవరణలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల చేత ప్రాజెక్టులను తయారు చేయించటం అభినందనీయ మన్నారు. అనంతరం కదలికలు దాని పనితీరు అనే అంశంపై ఆరవతగతి విద్యార్థిని పట్టెం షారోన్ గ్లోరియ చక్కగా వివరించారు. రామన్ ఎఫెక్టును కనుగొన్న సర్ సివి రమన్ పుట్టినరోజు ఫిబ్రవరి 28న భారతదేశంలో జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొనడం జరుగుతున్నదని షారోన్ గ్లోరియస్ తెలిపారు. అనంతరం ప్రాజెక్టులను తయారు చేయడంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, సైన్స్ ఉపాధ్యాయని టి జీవన జ్యోతి, ప్రియాంకా, రజనీ, రాణీ, బషీర్ పాల్గొన్నారు.
View More
Education
01 Mar 2025 15:58 PM
0
33
Newsread Image

No.1 Short News

Newsread
ఫీజు రీయింబర్స్మెంట్ కు మరో 216 కోట్లు.. మూడు రోజుల్లో విడుదల: లోకేష్
ఫీజు రీయింబర్స్మెంట్ తొలి విడతలో 788 కోట్లకు గాను 571 కోట్లు నిధులు విడుదల. రెండు, మూడు రోజుల్లోనే 216 కోట్లు విడుదల. డిగ్రీ కాలేజీలకు 5 ఏళ్లకు ఓసారి అఫిలియేషన్ జారీ. ప్రైవేట్ పాఠశాలలకు గుర్తింపు గడువు 10 ఏళ్లకు పెంపు.
View More
Education
05 Feb 2025 15:51 PM
0
32
Newsread Image

No.1 Short News

Newsread
GATE 2025 | ఫిబ్రవరిలో ‘గేట్‌ ’ పరీక్ష
జాతీయంగా నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ టెస్ట్‌ (గేట్‌)కు రంగం సిద్ధమయ్యింది. ఫిబ్రవరి 1, 2 15, 16 తేదీల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం 8 సెషన్లల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది గేట్‌ను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తున్నది.
View More
Education
30 Jan 2025 13:16 PM
2
34
View Latest Short News
You are offline
Please check your internet connection.
Close

Find News

News Categories

  • All Categories
  • Jobs
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel