

No.1 Short News
న్యూస్ రీడర్ తాళ్లూరుటీడీపీ, జనసేనతో కలిస్తే మాకే నష్టం: బీజేపీ ఎమ్మెల్యే
తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సొంతంగా ఎదుగుతున్న సమయంలో ఇతర పార్టీలతో పొత్తు సరికాదన్నారు. కొన్ని అంశాలపై ప్రాంతీయ, జాతీయ పార్టీల వైఖరుల మధ్య తేడాలుంటాయని పేర్కొన్నారు.
View More
Politics
18 Mar 2025 14:55 PM


No.1 Short News
న్యూస్ రీడర్ తాళ్లూరు*టిడిపి కార్యకర్తకు భరోసా*..
దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామం టిడిపి నాయకులు శ్రీనివాసరెడ్డి కుమార్తె ఇటీవల యాక్సిడెంట్ కు గురై గుంటూరులోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. విషయం తెలుసుకున్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించి, యోగక్షేమాలు, ట్రీట్ మెంట్ విధానం తెలుసుకొని అక్కడి డాక్టర్స్ తో మాట్లాడి...పార్టీ అండగా ఉంటుందని, అన్నీ విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు.
View More
Politics
16 Mar 2025 22:34 PM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంజోగి రమేశ్, దేవినేని అవినాశ్ లకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
ఏపీ సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంలపై దాడి కేసులపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. వైసీపీ నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాశ్ సహా 20 మంది దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీం విచారించింది. వీరందరికీ సుప్రీం ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లవద్దని రమేశ్, అవినాశ్ లను ఆదేశించింది.
View More
Politics
25 Feb 2025 15:15 PM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం మండలిలో లోకేశ్ వర్సెస్ బొత్స
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి నారా లోకేశ్ మంగళవారం శాసనమండలిలో వెల్లడించారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతుండగా వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని, రాష్ట్రంలో 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనికి మంత్రి లోకేశ్ వివరణ ఇస్తూ.. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పడంలేదన్నారు. పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతాయని, వాటితో పాటు అనుబంధ సంస్థలలో యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కాగా, మంగళవారం పలు అంశాలపై శాసన మండలిలో ఎన్డీయే కూటమి, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
View More
Politics
25 Feb 2025 12:59 PM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ సభ్యుల నిరసన.. గందరగోళం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించండని పోడియంలో నినాదాలు చేస్తున్నారు. ప్రజల గొంతుకను వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జగన్, బొత్స సత్యనారాయణ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా పోడియంలో నిరసన చేపట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గందరగోళం, నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.
View More
Politics
24 Feb 2025 10:34 AM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంఢిల్లీ ఫలితాల ట్రెండ్ పై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దూసుకుపోతుండడంపై జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ పార్టీల అగ్ర నాయకత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీలో మీరు మరింత పోట్లాడుకోండి, ఒకరినొకరు ఓడించుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు. ఈమేరకు ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కూటమిలోని పార్టీల్లో విభేదాలు పొడసూపాయి.
View More
Politics
08 Feb 2025 10:49 AM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంమంత్రులు స్లోగా ఉంటే కుదరదు... ఎవరినీ ఉపేక్షించను: సీఎం చంద్రబాబు
ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో మాట్లాడారు. మంత్రుల పనితీరు మెరుగుపడాలని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలలు రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించానని, మంత్రుల పనితీరు గురించి పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. కానీ ఇకపై మంత్రుల పనితీరుపై ఫోకస్ పెడతానని, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
మంత్రులు నిదానంగా ఉంటే కుదరదని, గేర్లు మార్చి ముందుకు వెళ్లాలని అన్నారు. మంత్రుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, మంత్రులు ఆప్కోస్ ద్వారా కాకుండా... శాఖల వారీగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవచ్చని సూచించారు.
View More
Politics
06 Feb 2025 18:10 PM
You are offline
Please check your internet connection.
Close