

No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంపెట్టింది 30 కోట్లు .. వచ్చింది 13 కోట్లు!
తమిళ దర్శకులలో 'బాల' స్థానం ప్రత్యేకం. మొదటి నుంచి కూడా ఆయన ఎంచుకునే కథలు కొత్తగా ఉంటాయి. ఆయన కథల్లోని నాయకులు కూడా డిఫరెంట్ గా ఉంటారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందనగానే ఒక వర్గం ప్రేక్షకులు చాలా ఆసక్తిని కనబరుస్తుంటారు. అలాంటి ఆయన నుంచి వచ్చిన సినిమానే 'వనంగాన్'. అరుణ్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా, జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రిధా .. రోషిణి ప్రకాశ్ .. సముద్రఖని కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. బీ స్టూడియోస్ - వీ హౌస్ బ్యానర్లలో ఈ సినిమాను నిర్మించారు. 30 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా, కేవలం 13 కోట్లను మాత్రమే వసూలు చేయగలిగింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 21వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లోకి అడుగుపెట్టింది.
View More
Entertainment
25 Feb 2025 15:34 PM


No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీలను ప్రారంభించిన అపోలో ఫౌండేషన్
అపోలో హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సి. ప్రతాప్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అపోలో ఫౌండేషన్ తాజాగా ఏపీలోని పిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీలను ప్రారంభించింది. తద్వారా అపోలో ఫౌండేషన్ సమాజ సంక్షేమంలో ఒక గొప్ప అడుగు వేసింది.
ఇక అపోలో ఫౌండేషన్ ఈ మోడల్ అంగన్‌వాడీల ద్వారా తల్లులు, నవజాత శిశువులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, చిన్ననాటి సంరక్షణలో మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. అపోలో హాస్పిటల్స్ చొరవ పట్ల పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పిఠాపురం అభివృద్ధిలో ముందుకెళ్తోందని వారు చెబుతున్నారు.
View More
Entertainment
05 Feb 2025 16:16 PM
You are offline
Please check your internet connection.
Close