యువజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పెద్దులపల్లి ప్రభాకర్
ఈరోజు ఒంగోలు లో జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి సమావేశంలో కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన పెద్దుల్లపల్లి ప్రభాకర్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ.... రాష్ట్రములో నిరుద్యోగ సమస్యలు మరియు హక్కులకోసం యువజన సమాఖ్య నిరంతర పోరాటాలు చేస్తుందని, రాష్ట్రము లో ఖలీగా ఉన్న 2లక్షల 50 వేల ఉద్యోగాల భర్తీ మరియు ఉద్యోగ జాబ్ క్యాలెండరు మరియు తొలగించిన వాలంటీర్ ఉద్యోగాలను కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను సమీకరించి ఉద్యమం చేస్తుందని అదేవిధంగా కడప జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్కిల్ సెన్స్ సర్వే ద్వారా 6లక్షల పైగా నిరుద్యోగులను గుర్తించారని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా 1లక్ష 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరియు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా కొంతవరకు నిరుద్యోగులకు బాసటగా గా ఉంటుందని కడప జిల్లా నిరుద్యోగుల
ఆకాంక్షయిన ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేసారు.