మార్కాపురంలో కాంగ్రెస్ నాయకులు మూడో వార్డు పరిధిలో గల సుందరయ్య కాలనీ సందర్శించారు అక్కడ ప్రజలను అడిగి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకున్నారు అయితే ఎక్కడ ఆ కాలనీ ఏర్పడి 24 సంవత్సరాలు అయిన ఇప్పటికీ సరైన రోడ్డు లేవని తాగునీటి వసతి లేదని ఇప్పటివరకు ఇళ్ల పట్టాలు మంజూరు కాలేదని అక్కడ ప్రజలు వివరించారు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ మహబూబ్ వలి గారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను తీర్చాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రిహానాబాను, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, తర్లుపాడు మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, మార్కాపురం పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు