

No.1 Short News
Newsreadప్రజల సొమ్ముకు కూటమి ప్రభుత్వం జవాబుదారి గా వ్యవహరిస్తుంది: గొట్టిపాటి లక్ష్మి
సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం దర్శి మండలం, తూర్పు వీరాయపాలెం గ్రామంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి పాలన పై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ
ప్రజల సొమ్ము దోచుకునే పార్టీలు, నాయకులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని డాక్టర్ లక్ష్మీ హెచ్చరించారు. 3,500 కోట్లు ఒక్క లిక్కర్ స్కామ్ లోనే దోచుకొని దాచుకొని తప్పించుకోవాలంటే కుదరదని, కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆస్తులను కాపాడడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు గత అయిదేళ్ల ఆంధ్ర ప్రదేశ్ ను విధ్వంసం నుండి వికాసం వైపు నడిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పరితపిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం నుండి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించడం, విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడంతో ప్రజలకు నమ్మకాన్ని కలిగించే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు వలె ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఏడాది కూటమిపాలన ప్రజాపాలనగా సాగుతుంది. ఏ గడపకు వెళ్లినా, ఏ తల్లిని అడిగినా, ఏ చెల్లిని అడిగినా వారిలో ఆనందం కనిపిస్తుంది. ఈ ఏడాది చంద్రన్న పాలనలో అందరం ఆనందంగా స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. గత ఐదేళ్లు అక్రమ కేసులు, కులమతాల మధ్య చిచ్చు పెట్టడం, వర్గ వైశమ్యాలు, విధ్వంశాలతో విసిగిపోయామని, తమ ప్రాణాలకు, తమ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ప్రజలు వాపోయారన్నారు. ఏడాది కూటమిపాలనలో మేమెంతో ఆనందంగా ఉన్నామని చెబుతుంటే కూటమి ప్రభుత్వ ప్రతినిధిగా ప్రతి గడపకు వెళ్లి వింటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజల కు మేలు చేయాలనే తలంపుతో విద్య వైద్యం మౌలిక సదుపాయాల కల్పన కోసం నిరంతరం మన ప్రభుత్వం కృషి చేస్తుంది. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కాలంలో దర్శి నియోజకవర్గంలో గత వైసిపి నిర్లక్ష్యానికి నిలువుటద్దాలుగా అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళుతున్నాం. దాదాపు 200 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం, ఇది మన ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యమైంది. గత ప్రభుత్వంలో అక్రమ కేసులు, కులాల మధ్య చిచ్చు పెట్టడం వంటి కార్యక్రమాలతోనే ఐదేళ్లు కాలం గడిపారు. వారి పాపాలు పండి జైళ్ల బాట పట్టే రోజులు వచ్చాయి. తప్పించుకునేందుకు జనం మధ్యకు వచ్చి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, ప్రజలు మోసపోయే పరిస్థితుల్లో లేరు. ఒకసారి నమ్మి ఓటేస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని 50 ఏళ్ల వెనకబాటుతనానికి కారణమయ్యారు. మరొక్కసారి నమ్మే పరిస్థితిలో లేమని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. ప్రతి గడపలో మన సంక్షేమ అభివృద్ధి ఉండాలి, అందుకు ప్రజలందరూ కూటమి ప్రభుత్వంలో అందే ఫలాలను అందిపుచ్చుకోవాలి. ఎవరికైనా సాంకేతికంగా సంక్షేమ పథకాలు అందకపోతే సంబంధిత అధికారుల ద్వారా వెంటనే చర్యలు చేపట్టాలని పార్టీ నాయకులను కోరారు. ఇలా అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వంలో మనమందరం సేవకులుగా సైనికులుగా పనిచేయాలని డాక్టర్ లక్ష్మి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మన డాక్టర్ లక్ష్మి గారికి తూర్పు వీరాయపాలెం గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు పెద్ద ఎత్తున ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహపూరిత వాతావరణం లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, దర్శి మండల పార్టీ అధ్యక్షులు మరెళ్ల వెంకటేశ్వర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు మండాది వెంకటేశ్వర్లు, టౌన్ అధ్యక్షులు చిన్న, టిడిపి నాయకులు వెంకటేశ్వర్లు మధుమంచి ఏడుకొండలు, నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, క్లస్టర్లు, యూనిట్ మరియు బూత్ ఇంచార్జిలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.