తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామానికి చెందిన షేక్ రబ్బాని S/O మస్తాన్ వలి APSP డిపార్ట్మెంట్ వారు నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలలో దేహదారుడ్య పరీక్షలలో, ఎగ్జామ్ లో 115 మార్కులు సాధించి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ గ్రామంలో హిందూ ముస్లిం ఐక్యత ని పెంపొందించే దిశగా కార్యక్రమాలు చేపడుతూ ఉండే రబ్బాని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం పట్ల మిత్రులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.