అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి తూర్పు వీరాయపాలెం వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరాయపాలెం యువకుడు అనిల్ కుమార్ చంద్రబాబు తో మాట్లాడుతూ ఆగిపోయిన వీరాయపాలెం ఉల్లగల్లు బ్రిడ్జి నిర్మాణం గురించి వివరించగా వెంటనే చంద్రబాబు జిల్లా కలెక్టర్ కి ఆ పని వెంటనే పూర్తి చేయమని ఆదేశాలు జారీ చేశారు.