మడకశిర మండల పరిధిలోని S.రాయపురం గ్రామంలో రైతు బూత్ రాజు తన పొలంలోకి పొలం పనులు నిమిత్తం చూసుకొని ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో బూత్ రాజు పై ఎలుగుబంటి దాడి చేసిందని ఆ గ్రామ ప్రజలు తెలిపారు, 108 వాహనం ద్వారా మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు బూత్ రాజుకు ఎలుగుబంటి దాడి చేసిందని విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బూత్ రాజును పరమర్శించి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు, మెరుగైన చికిత్స కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం_