పోతకమూరు హైస్కూల్ విద్యార్థినులతో కాసేపు మాట్లాడిన జిల్లా ఎస్పీ దామోదర్
ప్రకాశం జిల్లా, దర్శి మండలం, పోతకమూరు గ్రామంలోని జడ్పీ హైస్కూల్ చదువుతున్న విద్యార్థులకు గుడ్ & బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, హెల్మెట్ పై కూడా అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థినులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ మధ్య తేడా తెలుసుకోవడం మరియు స్వీయ రక్షణ, మహిళలపై జరుగుతున్న నేరాలు, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా అవగాహన కల్పించారు. ఫోన్లో అనవసరమైన/తెలియని వాటి జోలికి వెళ్ళరాదని, సైబర్ నేరాల పట్ల విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండాలన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణగా మెలిగి, బాగా చదువుకోవాలని ఉన్నత స్థాయికి చేరుకోని జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు. వారి కుటుంబసభ్యులు బైక్ మీద వెళ్లేటప్పుడు రహదారి భద్రత నియమాలు పాటిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమని చెప్పాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. ఏదైనా అత్యవసర సమయంలో పోలీసు వారి సహాయం పొందాలంటే అటువంటి సమయంలో సమీపంలోని పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ - 100/112 కు కాల్ చేయడం ద్వారా సత్వర సహాయం అందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర మరియు సిబ్బంది ఉన్నారు.