

No.1 Short News
Newsreadజై యూనియన్ కు వెన్ను దన్ను గా నిలుస్తా: దాడి సత్యనారాయణ
విశాఖ లో జై యూనియన్ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ హాజరయ్యారు. ముందుగా జై యూనియన్ సభ్యులు ఎదుర్కుంటున్న సమస్యలు రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ రెడ్డి వివరించారు. అనంతరం దాడి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం లో జై యూనియన్ ప్రసారాలు అద్భుతంగా ఉన్నాయని, వీరి శ్రమకు మద్దతు ఇస్తానని, ఏ సమయం లో నైనా జై యూనియన్ పక్షాన నిలబడి వారు ఎదుర్కుంటున్న సమస్యల పట్ల పోరాడతానని, వార్తలు చేరవేయడంబ్లో వీరు ఎంతో వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని, వీరి సాధక బాధలను గురించి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. త్వరలోనే స్వయంగా చంద్రబాబు తో మాట్లాడి యూట్యూబ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Latest News
11 Apr 2025 06:26 AM