

No.1 Short News
Umar Fharooqతాగునీటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించబోను
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా,ఆర్.డబ్ల్యు.ఎస్.అధికారులతో గురువారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లాలో తాగునీరు సరఫరా అవుతున్న తీరుపై సమీక్షించారు. స్థానికంగా ఉన్న రక్షిత మంచినీటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అలా కాకుండా అవసరం లేని చోట ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినట్లు తన దృష్టికి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. తాగునీటి సమస్య ఉందని ప్రజలు కాల్ సెంటరుకుగానీ, అధికారులకుకానీ ఫోన్ చేస్తే వారితో దురుసుగా ప్రవర్తించినట్లు గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. తాగునీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. అవసరమైతే ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు.
Latest News
18 Apr 2025 18:03 PM