No.1 Short News

Umar Fharooq
మార్కాపురంలో శాంతి భద్రతల దృష్ట్యా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్
మార్కాపురం పట్టణం నందు మొత్తం 28 ప్రదేశాలలో ప్రకాశం జిల్లాకు చెందిన 155 మంది పోలీసు అధికారులు మరియు 600 సిబ్బందితో కలసి, ప్రత్యేక పోలీస్ బలగాలు స్పెషల్ పార్టీ, స్వాట్ టీం, 30 డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతమైన తనిఖీలు నిర్వహించడం జరిగింది. పాత నేరస్తుల ఇళ్లలలో, చెడు నడతకలిగిన వారు, గంజాయి అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్ యాప్స్, కిరాణా షాప్ లలో, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు మరియు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని మోటార్ సైకిళ్లు, సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేటు సరిగా లేకపోవడం, ఇన్సూరెన్స్ లేకపోవడం, వంటి వివిధ రకాల వాటిని స్వాధీనం చేసుకున్నారు. వంటి వివిధ రకాల వాటిని స్వాధీనం చేసుకున్నారు. లాడ్జీలను, డార్మోట్స్ తనిఖీ చేసి,కొత్త వ్యక్తుల యొక్క వివరాలు ఆరా తీసి అనుమానిత వ్యక్తుల వివరాలను అడిగి ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా మరియు ప్రజల యొక్క భద్రతను కల్పించుటకు ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.
Latest News
18 Apr 2025 17:44 PM
0
7