

No.1 Short News
Newsreadహజ్ కమిటీ చైర్మెన్ హాసన్ బాషా గారికి సన్మానం.
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హజ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన హాజీ షేక్ హసన్ బాషా గారు ఈరోజు సాయంత్రం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయానికి విచ్చేసిన సందర్భంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ ఫారూఖ్ షిబ్లి స్వాగతాన్ని పలుకుతూ ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష రూపాయల హజ్ సబ్సిడీ ఆంధ్ర రాష్ట్రం నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న ప్రతి ఒక్క హాజీకి అందించే విధంగా ప్రభుత్వం చేరువ తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే హజ్ యాత్ర అనేది పూర్తి ముస్లిం సాంప్రదాయానికి మరియు ఇస్లాం విధానం నందు ఒక భాగం ఇటువంటి కమిటీలో ఒక్క ముస్లిం మత పెద్ద కూడా లేకపోవడం బాధాకరం, కాబట్టి మిగిలిన ముగ్గురు సభ్యులను ముస్లిం మత పెద్దలను ఇందులో నియమించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు & MHPS ఉలేమా వింగ్ మౌలానా హుస్సేన్, మౌలానా అబ్దుల్ రెహమాన్, ముఫ్తీ యూనస్, మౌలానా అబుల్ సత్తార్ ఖాన్ అలాగే MHPS విజయవాడ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
19 Apr 2025 10:17 AM