

No.1 Short News
DR Local News - Chiralaమే 4 వా తేదీన ఉచిత నాయి బ్రాహ్మణ వివాహ వేదిక
నాయి బ్రాహ్మణ వివాహ వేదికను వినియోగించుకోండి
ఒంగోలులో పద్మావతి ఫంక్షన్ హాల్ లో మే 4వ తారీకు ఆదివారం జరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఉద్యోగుల ,సాంస్కృతిక ,సంక్షేమ సంఘం ఒంగోలు వారిచే 5 ఉచిత వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ హైమ సుబ్బారావు మరియు డాక్టర్ తాడివలస దేవరాజు.
చీరాల హైమ హాస్పిటల్ ఆవరణలో ఉచిత వివాహ వేదిక కరపత్రాన్ని ప్రారంభించిన డాక్టర్ హైమ సుబ్బారావు మరియు డాక్టర్ తాడివలస దేవరాజు ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు డాక్టర్ దేవరాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా మూడు వేల మందికి పైగా ఉచితంగా వివాహ వేదిక ద్వారా వివాహాలు చేసినటువంటి వివాహ పరిచయ వేదిక నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ వధూవరుల కోసం ఎదురుచూస్తున్నటువంటి తల్లిదండ్రులు మరియు వాళ్ళ పిల్లలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కన్వీనర్ నాదెండ్ల రాఘవ మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల నుండి గత ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది ఈ వివాహ వేదిక కార్యక్రమంలో పాల్గొంటున్నారని , నాయి బ్రాహ్మణ తల్లిదండ్రులకు వధూవరుల పరిచయం మాది, నిర్ణయం మీది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఉచిత వివాహ వేదిక కన్వీనర్ నాదెండ్ల రాఘవ, పోతకమూరి మధుబాబు, మార్కాపూరాం వెంకట రామారావు పాల్గొన్నారు.
Local Updates
20 Apr 2025 17:14 PM