

No.1 Short News
Newsreadదర్శి: గడియార స్తంభం తొలగించవద్దని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బూచేపల్లి
దర్శి పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2001 వ సంవత్సరం లో గడియార స్తంభం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ గడియార స్తంభం అప్పటి పంచాయతీ పర్మిషన్ మరియు R&B అధికారుల పర్మిషన్ తో నిర్మించి దర్శి కి ఒక గుర్తింపు చిహ్నం గా నిలిచినది.ఈ గడియార స్తంభం ను తొలగించాలి అని ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలుసుకొని ఈరోజు ఒంగోలు లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియ గారిని కలిసి దర్శి పట్టణానికి 23 సంవత్సరాల నుండి చిహ్నం గా ఉన్న గడియార స్తంభం ను తొలగించవద్దని దర్శి MLA డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగినది.
Latest News
21 Apr 2025 21:56 PM